ఆయన సినిమాలను ఆయనే కాపీ కొడతాడ ? - MicTv.in - Telugu News
mictv telugu

ఆయన సినిమాలను ఆయనే కాపీ కొడతాడ ?

July 10, 2017

బాహుబలి సినిమా మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. కానీ బాహుబలి ఒక పెద్ద మాస్టర్ కాపీ పీసు అని ఎందరికి తెలుసు ? కాస్త డీప్ గా ఆలోచిస్తే బాహుబలి కాపీ సినిమానే అని మీరు కూడా అనేస్తారు. కానీ ఇదేదో బయటి సినిమాలకు మాత్రం అస్సలు కాపీ కాదులెండి. తను గతంలో ప్రభాస్ తోనే తీసిన ‘ ఛత్రపతి ’ సినిమా కథనే బాహుబలికి అన్వయించాడు సింపుల్ గా. కాకపోతే ఇక్కడ నేపథ్యాలు మార్చాడంతే.

ఒకరంటారు ఇది అన్నదమ్ముల పంచాయితీ అని, ఇంకొకరంటారు ఇది తల్లీ కొడుకుల తగవులాట అని, మరికొందరంటారు ఇది అత్తాకోడళ్ళ లొల్లి అని, ప్రియురాలి కోసం పెనుగులాట అని, రాజ్యాల కోసం రాజీ లేని పోరు అని, పాలోల్ల లఢాయి అని, అది అని, ఇది అని ఇలా.., చాలా మంది చాలా రకాలుగా బాహుబలిని తమ తమ పాయింటాఫ్ వ్యూలోంచి విశ్లేషించారు. అలా ఈ సినిమా రిలీజ్ కు ముందు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ? అనే సస్పెన్సుతో వచ్చింది. రిలీజయ్యాక పైన చెప్పుకున్నట్టు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ సినిమా గురించి మాట్లాడం వల్ల కేవలం మౌత్ టాక్ తో ఈ సినిమాకు చాలా హైపొచ్చి జనాలు థియేటర్ దాకా వెళ్ళేలా ఉసిగొలిపింది. ఛత్రపతిలోనూ అన్నదమ్ముల పంచాయితే, ఇందులోనూ సేమ్ పంచాయితే. సవతి తల్లి సేమ్. కాకపోతే అందులో తల్లి ప్రేమ తనకే దక్కాలని తమ్ముడు కుట్ర పన్నితే ఇందులో రాజ్యాధికారం కోసం కుతంత్రం చేస్తాడు.

అంతే తేడా. తన సినిమాలను తనే కాపీ కొట్టుకోవడంలో రాజమౌళి చాలా గ్రేట్ కదా. అవును మరి ఎవరో రాసిన కథలను రైటర్ వితౌట్ పర్మిషన్, వితౌట్ రెమ్యూనరేషన్ కథలను దొంగిలించి సినిమాలు చేసి బదనాము అవుతున్న డైరెక్టర్ల కన్నా తన తండ్రి రాసిన కథలనే తాను ఇలా దర్జాగా కాపీ కొట్టుకుంటూ, తీసినవే తిప్పి తిప్పి తీస్తున్న జక్కన్న నిజంగానే జర హట్కే పర్సన్ కదా !