Home > Flash News > ‘బాహుబలి 2’ 2000 కోట్లు దాటేనా..?

‘బాహుబలి 2’ 2000 కోట్లు దాటేనా..?

‘బాహుబలి 2’కలెక్షన్ల సునామీ…తొలి 24 గంటల్లో భారత మార్కెట్ లోనే 125 కోట్లు…ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు 430 కోట్లు…అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా రికార్డు…రిలీజైన 9 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్ల వసూళ్లు…మూడువారాల్లో 1500 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా సరికొత్త రికార్డు…ఇలా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న బాహుబలి 2 ..2వేల కోట్లు సాధిస్తుందా అనేది దానిపైనే సినీ ఇండస్ట్రీస్ టాక్. ఇదే ఊపు కొనసాగితే వసూళ్లలో సరికొత్త సంచలనాలు నమోదు అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద సినిమాలేవి కూడా లేకపోవడం కూడా జక్కన్నకు కలిసి వస్తుంది. మరో నెల దాకా బిగ్ బిడ్జెట్ సినిమాలు లేవు. చిన్నచితకా సినిమాలు తప్ప. ఇదే మూవీ వండర్ బాహుబలి-2కి ప్లస్ పాయింట్.

‘బాహుబలి 2’ కలెక్షన్ల సునామీ ఇంకా కొనసాగుతూనే ఉంది. మూడు వారాల్లో రూ.1500కోట్లు సాధించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర నిలకడగా రన్ అవుతోంది. ఈ సినిమా కలెక్షన్లు రూ.2000 కోట్లకు పైగా దాటాలని అంటున్నారు ఆస్కార్‌ విజేత ఏ.ఆర్‌ రెహమాన్‌.ఆదివారం చెన్నైలో రెహమాన్‌ బాహుబలి 2 ను చూసిన ఆయన ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలిపారు. ‘రాజమౌళి గారు, కీరవాణి గారు.. చెన్నైలో బాహుబలి 2 చూశాను. ఈ సినిమా కలెక్షన్లు రూ.2000 కోట్లు దాటుతాయని ఆశిస్తున్నాను. మీరు దక్షిణాది సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఓ కొత్త గుర్తింపునిచ్చారు’ అని రెహమాన్‌ ట్వీట్‌ చేశారు.
రెహమాన్ అన్నట్లు నిజంగా 2000 వేల కోట్లు క్రాస్ అయితే వరల్డ్ వైడ్ గానే సరికొత్త రికార్డ్ అవుతోంది. నిర్మాతలు పెట్టిన పెట్టుబడికి నాలుగింతలు వచ్చినంతవుతుంది. మరోవైపు సినిమా రిలీజై నెల కావొస్తున్నా బాహుబాలి 2 పై జోకులు మాత్రం ఆగడం లేదు. ఆత్తాకోడళ్ల పంచాయతీకి ఇన్నికోట్లు ఏంట్రా బాబు అంటూ సెటైర్లు వేస్తున్నారు. సో విజువల్ వండర్ బాహుబలి 2..రూ.2వేల క్రాస్ అవుతుందో, లేదో చూడాలంటే వెయిట్ అండ్ సీ…

Updated : 23 May 2017 12:00 AM GMT
Next Story
Share it
Top