‘బాహుబలి’ గణపతికి భలే డిమాండ్... - MicTv.in - Telugu News
mictv telugu

‘బాహుబలి’ గణపతికి భలే డిమాండ్…

August 24, 2017

వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్రతి వీధి వీధి సందడే సందడిగా ఉంటుంది. ప్రతి ఏడాది వినాయక ప్రతిమలను వింత వింత ఆకారాల్లో తయారు చేస్తుంటారు. లేదంటే ఆ ఏడాది ప్రాచుర్యం పొందిన విశేషాలతో గణేష్ విగ్రహలను తయారు చేస్తుంటారు. ఈ ఏడాది మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ

‘బాహుబలి’ ఇతివృత్తంతో రూపుదిద్దుకున్న వినాయకులకు గిరాకీ పెరిగింది. బాహుబలి-2 మూవీలో ప్రభాస్ ఎనుగుపైకి ఎక్కి కూర్చుని బాణం వేసే దృశ్యంతో పోలిన వినాయకుడిని తయారు చేశారు చాలా చోట్ల.  ప్రభాస్ స్థానంలో వినాయకుడి విగ్రహం  ఉంది. దీనితో బాహుబలి వినాయకుడిని ఎక్కువగా కోనుగోలు చేస్తున్నారు. అటు భక్తులు, ఇటు సినీ అభిమానులను ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు.