బాహుబలి గుర్రం ఎక్కడిది? - MicTv.in - Telugu News
mictv telugu

బాహుబలి గుర్రం ఎక్కడిది?

June 27, 2017

బాహుబలిలో ప్రభాస్ యుద్దం చేసినప్పుడు గుర్రం మస్తు ఉర్కుతది గదా,ప్రభాస్ ఇట్ల కత్తులతోని మన్షుల్ని సప్ప సప్ప..సొప్పను నర్కినంటే నర్కుతుంటే గుర్రం జెట్ స్పీడ్ల ఆగకుంట ఉర్కుతనే ఉంటది,గ గుర్రం ఇక్కడిది గాదు.. బాహుబలికోసం ప్రత్యేకంగా యుకె నుంచి తెప్పించిన్రట,ఎందకు మనదగ్గర గుర్రాలు పన్కిరావా అన్కుంటున్రు గదా,బాహుబలిని మోసేతందుకు మన గుర్రాలు ఏమిట్కి పన్కిరావు,ఎందుకంటే పేరులనే ఉందికదా బాహు..బలి అని,ఆ కటౌట్ ను మోయాలంటే మనగుర్రాలు బలిగావాల్సింది,బాహుబలికోసం ప్రభాస్ ఏకంగా 130 కిలోలు దాక బరువు పెరిగాడు,మరి అంత భారీకాయాన్ని మోయాలంటే మనదగ్గరి గుర్రాలతోని ఏమైతది,ఇట్ల ఎక్కంగనే అట్ల కూలవడ్తయ్,ఇక్కడి గుర్రాలు 40,50 కిలోల బర్వును ఆపుడే కష్టమట,అందుకే రాజమౌళి సారు ముందుసూపుతోని దాన్నియూకెనుంచి తెప్పించిండట,మరి గంత బర్వును గుడ అల్కగ మోసిన గ యూకే గుర్రం…గంత గట్టిగుందంటే ఏం దింటదో ఏమో మరి.