అత్తాకోడళ్ల పంచాయితీకి రూ.15 వందల కోట్లు..! - MicTv.in - Telugu News
mictv telugu

అత్తాకోడళ్ల పంచాయితీకి రూ.15 వందల కోట్లు..!

May 19, 2017

 

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..ఒకే ఒక్క క్వశ్చన్…ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ వన్ పాయింట్ ఫార్ములాతో దాదాపు రెండు, మూడొందలతో కోట్లతో బాహుబాలి 2ని జక్కన్న తెరకెక్కించాడు. జవాబు ఏంటో తెలుసుకోవాలన్న ఉత్కంఠ తో ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు.
జక్కన్న స్లైలో ఒకే ఒక్కమాటలో చెప్పాలంటే బాహుబలి 2 గురించి  “అత్తాకోడళ్ల పంచాయితీ”..దీనికి ప్రేక్షకులు ఇప్పటివరకు 15 వందల కోట్ల రూపాయలు కుమ్మరించారు. ఇంకా బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురుస్తూనే ఉంది. ఈ అత్తాకోడళ్ల మధ్య పంచాయితీ ఫార్ములా ఇప్పటికాదు. వీరి మధ్య కొట్లాటే ప్రధానంగా తెరకెక్కిన సీరియళ్లు ,సినిమాలూ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాయి.ఇప్పుడు విజువల్ వండర్ బాహుబాలి 2 ఒకరకంగా ఇదే కోవలోకి వస్తోంది.
తెలుగు సినిమా కీర్తిని అంతర్జాతీయ వేదికలపై సగర్వంగా నిలబెట్టిన విజువల్ వండర్ బాహుబాలి పార్ట్ 2 మొత్తం శివగామి, దేవసేనల చుట్టూనే తిరుగుతోంది. రాజుగా ప్రకటించిన తరువాత దేశంలోని పరిస్థితులను తెలుసుకొని రమ్మని బాహుబలి కి కట్టప్పను తోడుగా ఇచ్చి దేశాటనకు పంపిస్తుంది శివగామి దేవి. అలా దేశాటనకు బయలుదేరిన బాహుబలి కుంతల రాజ్య యువరాణి దేవసేన అందం, ధైర్యసాహసాలు నచ్చి తొలి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. దేవసేన ప్రేమను గెలుచుకోవడానికి ఆమె రాజ్యంలోనే అతిథిలుగా ఉండిపోతారు. ఈ విషయం వేగుల ద్వారా తెలుసుకున్న భల్లాలదేవుడు కూడా దేవసేనను సొంతం చేసుకోవాలనుకుంటాడు. బాహుబలి ప్రేమ విషయం రాజమాతకు చెప్పక ముందే తాను దేవసేనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, ఎలాగైనా దేవసేనతో తన వివాహం జరిపించాలని శివగామి దగ్గర మాట తీసుకుంటాడు.

కొడుకు కోరికను మన్నించిన శివగామి, దేవసేనను తన కొడలిగా చేసుకోవాలని భావిస్తున్నానని వర్తమానం పంపుతుంది. అయితే శివగామి వర్తమానం పంపిన తీరు నచ్చని దేవసేన, శివగామి పంపిన బహుమతులను తిప్పిపంపుతుంది. కానీ కుంతల రాజ్యంలోనే ఉన్న బాహుబలి, కట్టప్పలు మాత్రం రాజమాత… దేవసేనకు బాహుబలితో వివాహం చేయించనుందని భావిస్తారు. ఆ నమ్మకంతోనే నీ గౌరవానికి ఎలాంటి భంగం కలగదని మాట ఇచ్చి దేవసేనను మాహిష్మతికి తీసుకువస్తాడు. మాహిష్మతికి వచ్చిన తరువాత అసలు నిజం తెలుస్తుంది.

దేవసేన అభిప్రాయం తెలుసుకోకుండా రాజమాత తీసుకున్న నిర్ణయాన్ని బాహుబలి తప్పు పడతాడు. దీంతో బాహుబలి మీద కోపంతో రాజమాత శివగామి దేవి, భల్లాలదేవుడిని రాజుగా, బాహుబలిని సైన్యాధ్యక్షుడిగా ప్రకటిస్తుంది. రాజుగా పట్టాభిషేకం జరిగిన తరువాత బాహుబలిని ఎలాగైన రాజమాతకు దూరం చేయాలనుకున్న భల్లాలదేవుడు, తండ్రి బిజ్జలదేవుడితో కలిసి కుట్రలు పన్ని బాహుబలి, దేవసేనలపై అంతఃపుర బహిష్కరణ శిక్ష వేయిస్తాడు. కోటకు దూరమైన బాహుబలి.. సామాన్యులతో కలిసి ఉంటూ అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు.

ఇది సహించలేని భల్లాలదేవుడు.. బాహుబలి బతికుండగా తనకు రాజుగా గుర్తింపు రాదని ఎలాగైన బాహుబలిని చంపేయాలని నిర్ణయించుకుంటాడు. బాహుబలి మామా అని ఆప్యాయంగా పిలుచుకునే కట్టప్పతోనే బాహుబలిని చంపిస్తాడు. ఇలా సాగే కథలో అత్త శివగామి, కోడలు దేవసేన దే ప్రధాన పాత్ర.సీన్ టు సీన్ వీరి చుట్టే ఉంటుంది. బాహుబలి, భల్లాల దేవల పాత్రలు అత్తాకోడళ్ల ముందు చిన్నబోయాయి. అద్భుతమైన గ్రాఫిక్స్ తో తెరకెక్కిన ఈ సినిమాను జనాన్ని ఎక్కువ ఆకట్టుకున్నది కూడా వీరే. సో బాహుబలి 2 కు ముందు డైరెక్టర్ రాజమౌళి ఒక్క క్వశ్చన్ వేస్తే..నెటిజన్లు వందల రివర్స్ క్వశ్చన్స్ ..లక్ష జోకులు పేల్చారు.