బైజూస్ అంటే మ్యాంగో జ్యూసో, హెరిటేజ్ జ్యూసో కాదు: బొత్స - MicTv.in - Telugu News
mictv telugu

బైజూస్ అంటే మ్యాంగో జ్యూసో, హెరిటేజ్ జ్యూసో కాదు: బొత్స

June 18, 2022

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా మండిపడ్డారు. బైజూస్ అంటే మ్యాంగో జ్యూసో, హెరిటేజ్ జ్యూసో అనుకున్నావా? చంద్రబాబు అంటూ సెటైర్లు వేశారు. బైజూస్ అంటే ఏమిటో మీ మనవడిని అడిగితే చెపుతారని ఎద్దేవా చేశారు.

బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ..”నా నియోజకవర్గానికి వెళ్లి నేను పనికిమాలిన వాడిని అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడారు. పనికిమాలిన తనానికి పేటెంట్ హక్కు చంద్రబాబుదేనని చేప్తున్నాడు. రాష్ట్రానికి పనికొచ్చే ఒక్క మంచి మాట కూడా చంద్రబాబు మాట్లాడలేదు. బైజూస్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. బైజూస్ అంటే మ్యాంగో జ్యూసో, హెరిటేజ్ జ్యూసో అనుకున్నావా? చంద్రబాబు. బైజూస్ అంటే ఏమిటో మీ మనవడిని అడిగు చెప్తాడు” అని ఆయన అన్నారు.

ఇటీవలే జగన్ ప్రభుత్వం.. రాష్ట్రంలో విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా అంతర్జాతీయంగా ప్రస్దిద్ధి చెందిన సుప్రసిద్ధ ఎడ్యుకేషనల్‌ టెక్‌ కంపెనీ ‘బైజూస్‌’తో (BYJU’S) ఒప్పందం కుదుర్చుకుంది. ఆ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. బైజూస్‌పై జగన్‌ మాట్లాడుతూ.. ‘బైజూస్‌తో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. ఈ ఒప్పందంతో ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించనున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 10వ తరగతి వరకు ఎడ్యు-టెక్‌ విద్యను అందిస్తాం” అని అన్నారు.

తాజాగా బైజూస్ విషయంలో చందబ్రాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా మండిపడ్డారు. పేద పిల్లలకు కూడా అంతర్జాతీయ కంటెంట్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో బైజూస్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని, చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని బొత్స అన్నారు.