నారాయణకు బెయిల్ మంజూరు - MicTv.in - Telugu News
mictv telugu

నారాయణకు బెయిల్ మంజూరు

May 11, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా జరుగుతోన్న పదోవ తరగతి ప్రశ్ప పత్రాల లీక్ కేసులో మంగళవారం నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్‌లోని తన స్వగృహంలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు, చిత్తూరు మేజిస్ట్రేట్ బెయిలు మంజూరు చేసింది.

ప్రశ్నా పత్రాల కేసు విషయంలో ఆయనను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి, చిత్తూరు జిల్లాకు తరలించారు. వైద్య పరీక్షల నిమిత్తం మేజిస్ట్రేట్ ఎదుట నారాయణను హాజరుపరిచారు. దాంతో ఆయనపై పోలీసులు మోపిన అభియోగాలను తోసిపుచ్చి, బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి సులోచనారాణి తెలిపారు.

నారాయణ మాట్లాడుతూ.. ”నారాయణ విద్యాసంస్థల అధినేతగా నేను 2014లోనే రాజీనామా చేశాను. ఇంకా దాని అధినేతగానే ఉన్నానని పోలీసులు నాపై తప్పుడు అభియోగం మోపారు. దానితో నాకు ఎలాంటి సంబంధమూ లేదని కోర్టుకు ఆధారాలు సమర్పించాను. నాపై మోపిన నేరారోపణ నమ్మేలా లేదని న్యాయమూర్తి నాకు బెయిలు మంజూరు చేశారు” అని ఆయన అన్నారు.