విక్రమ్ గౌడ్ కు బెయిల్ - MicTv.in - Telugu News
mictv telugu

విక్రమ్ గౌడ్ కు బెయిల్

August 19, 2017

సినీ ఫక్కీలో మాయ చేసి ఒక్కసారిగా ఏదో అయిపోదామని, ఏదో అయిపోయిన విక్రమ్ కుమార్ గౌడ్ కు బెయిలు మంజూరైంది. తను నిర్మాతగా సినిమా తీసినా, లేకపోతే నాన్న ప్లేసులో తను రాజకీయాల్లో నిలబడి పోటీ చేసినా ఇంత పాప్యులారిటీ రాకపోవునేమో. తన కిరాయి మనుషుల చేత గన్ తో షూట్ చేయించుకొన్నాడనే ఆరోపణతో విక్రమ్ జైల్లో వున్న సంగతి తెలిసిందే.

నిజం నిప్పులాంటిది. అది ఎంత కప్పి పెడదామన్నా ‘నేను దాగను’ అంటుంది. ఏదో ఒక రోజు అది ఎవరి ద్వారానైనా తన గొంతు విప్పుతుంది. కానీ విక్రమ్ గౌడ్ అలా అనుకున్నట్టు లేడు.  నిజాన్ని భూస్థాపితం చేద్దామనుకొని అడ్డంగా బుక్ అయి ఊచలు లెక్కబెడుతున్నాడు.  పాపం అతని పాట్లు చూళ్ళేక ఆయన లాయరు బెయిలిప్పించాడు. ఇక నుండీ ఆ బెయిల్ పుణ్యమా అని మహారాజా వారు ప్రతీ ఆదివారం పోలీస్ స్టేషన్ కు హాజరై తమ ఆటోగ్రాఫ్ పెట్టాలంట