Baireddy Siddharth Reddy criticized Pawan Kalyan
mictv telugu

ముందు మా జగన్ సార్‌ని అనాలి : బైరెడ్డి సిద్ధార్థ్‌

October 20, 2022

Baireddy Siddharth Reddy criticized Pawan Kalyan

వైసీపీ, సీఎం జగన్‌ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు, దానికి కౌంటర్‌గా మంత్రుల వాగ్బాణాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా వేడెక్కిపోయి ఉంది. ఈ మంట ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో శాప్ చైర్మెన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పవన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇస్తూ సీఎం జగన్‌పై తన మనసులో మాట చెప్పారు. ‘ఎవరినీ అనకూడదు. ముందు మా జగన్ సార్‌ని అనాలి. ఆయన ఆగమన్నాడు కాబట్టి ఆగాం.

లేకపోతే పరిస్థితి వేరేలా ఉండేది’ అంటూ అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్, సీఎం జగన్‌ల మధ్య రెండు మూడేళ్లు మాత్రమే వయసు తేడా ఉటుందని, కానీ, సాధించిన ఘనతల విషయంలో చాలా వ్యత్యాసం ఉందన్నారు. పవన్ రెచ్చిపోయి మాట్లాడితే గ్రామాల్లో ఉండే జనసేన కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందో ఆయన ఆలోచించుకోవాలన్నారు. మంత్రుల మీద దాడులకు తెగబడుతుంటే కేసులు పెట్టకుండా ఉంటారా? అని ఎదురు ప్రశ్నించారు. జగన్ లక్షలాది మందిని పేర్లు పెట్టి పిలుస్తారని, అదే పవన్ కల్యాణ్ మాట్లాడిన స్టేజీ మీద ఉన్నవారి పేర్లు ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. జగన్ ఏం సాధించారో చెప్పడానికి పెద్ద లిస్టు ఉందని, పవన్ గురించి మాత్రం 2014లో పొత్తు, 2019లో పొత్తు, 2024లో పొత్తు అని మాట్లాడుకోవాలి తప్ప ఏం లేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇంకోసారి వైసీపీ గురించి మాట్లాడితే జగన్ చెప్పినా వినబోమని హెచ్చరించారు.