యూత్ క్రేజీ పలర్స్ బైక్ సరికొత్త మోడల్‌లో..ధర ఎంతో తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

యూత్ క్రేజీ పలర్స్ బైక్ సరికొత్త మోడల్‌లో..ధర ఎంతో తెలుసా?

February 12, 2020

Bajaj Pulsar.

యూత్ నుంచి ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న బైకుల్లో ఒకటి బజాజ్ పల్సర్. ఈ బైక్‌పై రయ్‌మంటూ దూసుకెళ్తుంటారు. ఇది తొలిసారి మార్కెట్లోకిి వచ్చి 19 ఏళ్లు దాటినా ఇంకా దాని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రతిసారి సరికొత్త ఫీచర్లతో ప్రస్తుత యువత అభిరుచికి తగ్గట్టుగా ఈ బైకులను తయారు చేస్తూనే ఉంది ఆ సంస్థ. తాజాగా మరో సరికొత్త ఫీచర్లతో బీఎస్6 ఫార్మాట్లో మరో బైక్ లాంచ్ చేసింది. 

బీఎస్6 నిబంధనలకు అనుగుణంగా సరికొత్త మోడల్ లాంచ్ చేశారు. ఈ బైకులో  ఫెదర్ టచ్ స్టార్ట్, ఆప్టిమమ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, డబుల్ డిస్క్ బ్రేక్, ట్యుబ్ లెస్ టైర్, సింగిల్ ఛానెల్ యాంటీ బ్రేకింగ్ వ్యవస్థ  ఏర్పాటు చేశారు. రెండు వేరియంట్లలో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. పల్సర్ 150 వేరియంట్ ధర రూ.94,956 ఉండగా.. పల్సర్ 150 ట్విన్ డిస్క్ వేరియంట్ ధర రూ. 98,835గా ఉంది. కాగా బీఎస్4 మోడల్ తో పోలిస్తే దీని ధర రూ. 8,998 ఎక్కువ. ఇప్పటికే బజాజ్ డీలర్ల దగ్గర ఈ బైక్ కు సంబంధించి బుకింగ్స్ ప్రారంభమయ్యాయని ఆ సంస్థ తెలిపింది. నలుపు, నలుపు-ఎరుపు రెండు రంగుల్లో ఇది లభ్యం కానుంది.