తెలంగాణ ఆర్టీసీ చైర్మెన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్.. - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ ఆర్టీసీ చైర్మెన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్..

September 16, 2021

కీలకమైన నామినేటెడ్ పోస్టును తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసింది. రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ఛైర్మెన్ గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నియమితులయ్యారు. తమ నేతకు జోడు పదవులు లభించినందుకు బాజిరెడ్డి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

బాజిరెడ్డి మంత్రి పదవి దక్కుతుందని ఇదివరకు ఊహాగానాలు వచ్చాయి. అది నెవవేరకపోవడంతో ఆర్టీసీ ఛైర్మన్‌ పదవిని కట్టబెడతారని చాలా రోజుల నుంచే వార్తలు వస్తున్నాయి. ఎన్‌కౌంటర్ల స్పెషలిస్టుగా పేరుపొందిన సజ్జన్నార్ ఇటీవల పోలీస్ యూనిఫారమ్ వదిలేసి ఆర్టీసీ ఎండా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.