నటి సాయిపల్లవి వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి కశ్మీర్ పండిట్ల మారణహోమం, గో హత్యలను లింక్ చేసి మాట్లాడింది. దీంతో ఈ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. సాయిపల్లవిపై భజరంగ్ దళ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుల్తాన్ బజార్ పీఎస్‌లో ఆమెపై ఫిర్యాదు చేశారు. ఉగ్రవాదులతో గోరక్షకులను పోల్చారంటూ సాయిపల్లవిపై ఫిర్యాదు చేశారు.
విరాటపర్వం సినిమా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన సాయి పల్లవి.. కశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రస్తావించారు. అప్పట్లో జరిగిన కశ్మీరీ పండిట్ల హత్యలను ఆ సినిమాలో చూపించారని పేర్కొన్నారు. ఇక ఇటీవల గోవులను అక్రమంగా తరలిస్తున్నారనే కారణంతో ఓ ముస్లిం వ్యక్తిపై కొంతమంది దాడికి పాల్పడ్డారని.. ఆ సమయంలో జైశ్రీరామ్ అంటూ నినదించారని అన్నారు. మతం పేరుతో జరిగే ఏ దాడులు సరికావని.. ఈ విషయంలో అప్పటి కశ్మీరీ పండిట్ల హత్యలకు, గోవులను తరలిస్తున్నారనే పేరుతో జరుగుతున్న దాడులకు తేడా లేదన్నారు. ఈ వ్యాఖ్యలే కొందరు నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. కశ్మీర్లో జరిగిన మారణహోమాన్ని, అక్రమంగా గోవులను తరలిస్తున్నవారిపై జరుగుతున్న దాడులను ఎలా పోలుస్తూ.. భజరంగ్ దళ్ సుల్తాన్ బజార్ పీఎస్‌లో ఆమెపై ఫిర్యాదు చేసింది.