జగన్ ఇంటి వద్ద ‘డిక్లరేషన్’ ధర్నా.. తీవ్ర ఉద్రిక్తత - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ ఇంటి వద్ద ‘డిక్లరేషన్’ ధర్నా.. తీవ్ర ఉద్రిక్తత

September 23, 2020

Bajrang Dal Protest AP CM Jagan House in Hyderabad.

తిరుమలలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే దీనిపై ఏపీలో రగడ మొదలైంది. తెలంగాణలోనూ భజరంగ్‌దళ్ కార్యకర్తలు నిరసన తెలిపారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో ఉన్న ఆయన ఇంటిని ముట్టడించేందుకు బుధవారం ఉదయం ప్రయత్నించారు. డిక్లరేషన్ అవసరం లేదని మంత్రులు, టీటీడీ చైర్మన్ చెప్పడాన్ని వారు తప్పుబట్టారు. 

డిక్లరేషన్‌తో పాటు హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన ఇంటికి చేరుకునే లోపే పోలీసులు అడ్డుకున్నారు. రెండు వర్గాల మధ్య కొంతసేపు తోపులాట, వాగ్వాదం జరిగింది. అక్కడికి వచ్చిన వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ కొంత సేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో లోటస్ పాండ్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నివాసానికి 200 కిలోమీటర్ల దూరం నుంచే ఎవరూ రాకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కాగా, ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ నేరుగా తిరుమలకు వెళ్లనున్నారు. ఈ సాయంత్రం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి రేపు మరోసారి దర్శనం చేసుకోనున్నారు.