ఐదేళ్లలోపు పిల్లలకు ప్రత్యేక ఆధార్.. నీలిరంగులో.. - MicTv.in - Telugu News
mictv telugu

 ఐదేళ్లలోపు పిల్లలకు ప్రత్యేక ఆధార్.. నీలిరంగులో..

February 23, 2018

ఆధార్‌తో ఉన్న సమస్యలు ఇన్నీ అన్నీకావు. ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా సమస్యలు ఎదురవుతున్నారు. చిన్నప్పుడు ఇచ్చిన వేలిముద్రలు వగైరా బయోమెట్రిక్ సమాచారం, ఫొటోలు పెరిగే కొద్దీ మారుతుంటాయి. దీంతో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. అసలు పిల్లలకు ఆధార్ అక్కర్లేదనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు యూఐడీఏఐ కొత్త కార్డులు పట్టుకురానుంది.ఐదేళ్ల లోపు పిల్లలకు నీలిరంగు ఆధార్ కార్డులను జారీ చేస్తామని తెలిపింది. ‘బాల్ ఆధార్’ పేరుతో వీటిని ఇవ్వనున్నట్లు ట్విటర్లో వెల్లడించింది. ‘ఐదేళ్ల లోపు వారికి ఆధార్ తప్పనిసరి కాదు. అయితే స్కూళ్లు, అడ్మిషన్లు, గుర్తింపు కార్డుల విషయాల్లో ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇది పనికొస్తుంది.. ’ అని తెలిపింది.  

బాల్ ఆధార్ పై సర్కారు సూచనలు

బాల్ ఆధార్‌కు  దరఖాస్తు చేసుకునే వారు తమ తల్లిదండ్రుల ఒరిజినల్ ఆధార్ కార్డులను చూపాలి. జనన ధ్రువీకరణపత్రం, స్కూల్‌కి వెళ్లే పిల్లలైతే ఐడెంటిటీ కార్డు జత చేయాలి. బయోమెట్రిక్ అవసరం లేదు. ఫొటో సరిపోతుంది. ఏడేళ్ల వచ్చేనాటికి బయోమెట్రిక్ అవసరం. పది వేళ్ల ముద్రలు, ఐరిస్ ఇవ్వాలి. 15 ఏళ్ల వయసు రాగానే మళ్లీ బయోమెట్రిక్ డేటా ఇవ్వాలి.