bala krishna advertisement video goes viral in youtube
mictv telugu

వన్స్ ఐ ఎంటర్ హిస్టరీ రిపీట్స్ .. నెట్టింట్లో బాలయ్య వీడియో వైరల్

March 6, 2023

బాలయ్య ఏం చేసినా వైరలే..ఏం మాట్లాడినా సెన్సేషనే..బుల్లితెర, వెండితెర.. ఏదైనా వన్స్ హీ ఎంటర్ హిస్టరీ రిపీట్ అవ్వాల్సిందే. మాటల గారడీతో , యాక్టింగ్ పెర్ఫార్మెన్స్‏తో అందరితో జై బాలయ్య అని పిలిపించుకుంటున్నారు ఈయన. ఈ మధ్య ఓటీటీలో అన్‏స్టాపబుల్ షోతో బాలయ్య తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ షోకు సంబంధించి ఓటీటీలో విడుదలైన అన్ని సీరీస్ లు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో బాలయ్యా అటు సినిమాల్లో, ఇటు ఓటీటీలోనూ బిజీ బిజీ అయ్యారు. లేటెస్టుగా మన బాలయ్య బాబు కొత్తగా యాడ్ లు చేయడం మొదలుపెట్టేశారు. తాజాగా బాలయ్య నగల షాపుకి బ్రాండింగ్ చేస్తున్నారు. బాలయ్య చేసిన ఈ యాడ్స్ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

బుల్లితెరపై కనిపించి ఇన్నాళ్ళు ఫ్యాన్స్‏ను అలరించిన బాలయ్య బాబు తాజాగా ప్రకటనల్లోనూ నటిస్తూ అలిరిస్తున్నారు. అఖండ మూవీ హీరోయిన్ ప్రగ్యాతో కలిసి వేగ జ్యువెల్లర్స్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్నారు బాలయ్య. ఈ మధ్యనే షూట్ అయిన యాడ్ వీడియోను ఫస్ట్ టైం థియేటర్స్ లో ప్రదర్శించి వేగ జ్యువెల్లరీ, తమ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తోంది. ఎంతో అద్భుతంగా, భారీగా ఈ యాడ్ ను షూట్ చేశారు. మొదటి సారి థియేటర్స్ లో యాడ్‏ను ప్రీమియర్ చేసి చరిత్ర సృష్టించారు.

వేగ జ్యువెల్లరీ కోసం బాలయ్య ఏకంగా రెండు యాడ్‏లను షూట్ చేశారు. ఒక యాడ్ లో పట్టుబట్టలు, భారీ బంగారు ఆభరణాలు ధరించి హీరోయిన్ ప్రగ్యాతో కలిసి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం జరిపించగా మరో యాడ్‏లో వివాహానికి సిద్ధమైన పెళ్లికూతురికి వేగ జ్యువెల్లరీ నుంచి అందుబాటులో ఉన్న హెవీ డైమండ్ జ్యువెల్లరీని చూపించారు. ఈ రెండు యాడ్ లను భారీగా ఓ సినిమా రేంజ్ లో చిత్రీకరించారు. ఇందులో బాలయ్య ట్రెడిషనల్ లుక్స్ తో అదుర్స్ అనిపించారు. పట్టువస్త్రాలు ధరించి భారీ బంగారు ఆభరణాలతో బాలయ్య బంగారు బాలయ్య అయ్యారు. ఈ యాడ్ కు సంబంధించిన వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతోతంది. ఫ్యాన్స్ ఈ యాడ్స్ చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇలాంటివి మరిన్ని యాడ్స్ చేయాలని కోరుకుంటున్నారు.