భారత వాయుసేన భారత సరిహద్దుల్లో ఉన్న బాలాకోట్ ఉగ్ర క్యాంపులపై మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులు గతంలో ఎన్నడూ లేని విధంగా మన సత్తా చాటారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున ముష్కరులు మరణించినట్టు అధికారులు ప్రకటించారు. ఈ దాడులకు ప్రధాన వ్యూహకర్తగా వైఎస్ నేగీ పనిచేశారు. సైన్యానికి పలు సూచనలు చేస్తూ పని పూర్తిచేశారు. తాజాగా ఆయన పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో బుధవారం టైప్-69 మిగ్-21 ట్రైనర్ విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. సాంకేతిక లోపం కారణంగా విమానం ఒక్కసారిగా అదుపుతప్పి కుప్పకూలింది. ఈ ఘటనలో ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ వైఎస్ నేగీ ప్రమాదాన్ని ముందుగానే గ్రహించారు. నేగీ కొన్ని క్షణాల ముందు విమానం నుంచి కిందకు దూకేశారు. ఆ కాసేపటికే విమానం కుప్పకూలిపోయింది. మహారాజాపూర్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగినట్టు ఎయిర్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. నేగీ స్వల్ప గాయాలతో బయటపడినట్టు వెల్లడించారు.