తొలిసారిగా తన కెరీర్లో పవన్ కళ్యాణ్ ఒక టాక్ షోలో పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ 2 కోసం పవన్ తో షూటింగ్ కూడా ముగిసింది. కొత్త సంవత్సరంలో ఈ ఎపిసోడ్ ప్రత్యక్ష ప్రసారం కానుండగా.. అప్పుడే అంచనాలు తారాస్థాయికి చేరాయి. స్టార్ హీరో చిత్రం ఓపెనింగ్ మాదిరి.. బాలయ్య, పవన్ ఇంటర్వ్యూ జరిగింది. అభిమానుల కోలాహలం, పలువురు సెలబ్రెటీల మధ్య పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ షూట్ ముగిసింది. అయితే ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ని అడిగిన పలు ప్రశ్నలు సోషల్ మీడియాలో లీక్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. ఎవ్వరినైనా, ఎలాంటి ప్రశ్నలైనా అడిగేసే దమ్ము బాలయ్యకుంది. ఇప్పటివరకు వచ్చిన గెస్టులని మొహమాటం లేకుండా అలాగే కడిగేశాడు బాలయ్య. అయితే అచ్చం అలానే పవన్ ని కూడా ఒక ఆట ఆడుకున్నాడట బాలయ్య.
ఇక గర్ల్ ఫ్రెండ్స్, ఎఫైర్స్, మందు వంటి అంశాలని అడగటంలో తెగ ఇంట్రెస్ట్ చూపెట్టే బాలయ్య.. పవన్ పేరు వింటే గుర్తొచ్చే మూడుపెళ్ళిళ్ల గురించి టాక్ షోలో ప్రశ్నించాడట. అయితే టాక్ షోకి వచ్చేముందే క్వశన్స్ అన్ని పవన్ కి చేరాయట. త్రివిక్రమ్ దెగ్గరుండి ఇంటర్వ్యూ ప్రశ్నలని సెట్ చేశాడట. అందులో మూడు పెళ్లిళ్ల గురించి టాపిక్ వద్దంటూ త్రివిక్రమ్, పవన్ లు చెప్పారట. అయినా బాలయ్య వినలేదని..తనదైన శైలిలో మూడు పెళ్ళిల్ల గురించి అడిగేశాడని అంటున్నారు. దాంతో సమాధానం చెప్పలేక పవన్ కళ్యాణ్ కాస్త తడపడగా.. బాలయ్య సపోర్ట్ చేశాడట. పెళ్లిళ్లు, విడాకులు వ్యక్తి వ్యక్తిగతమని.. దాన్ని రాజకీయాలకు వాడుకోవటం దౌర్భాగ్యమని బాలకృష్ణ చెప్పినట్టు లీకులు వస్తున్నాయి. అయితే తన పెళ్లిళ్ల గురించి మాట్లాడితే చెప్పుతో సమాధానం చెప్తానంటూ మొన్న ఒక పబ్లిక్ మీటింగ్ లో వైసీపీ నేతలపై సీరియస్ అయ్యారు పవన్ కళ్యాణ్. మరి అన్ స్టాపబుల్ లో పవన్ బాలయ్యకి ఇచ్చిన సమాధానం ఏంటీ అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ ఎపిసోడ్ బయటికి వచ్చాక.. వైఎస్సార్సీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.