balakrishna comedy with mahesh babu son
mictv telugu

మహేష్ కొడుకుతో బాలయ్య కామెడీ.. తీవ్ర దుఃఖంలోనూ నవ్వులు

November 19, 2022

బాలయ్య ఎక్కడ ఉంటే అక్కడ సందడే. బోలా తనంతో కూడిన బోల్డ్ నెస్ బాలయ్య స్టైల్. ఎదురుగా ఎంతమంది ఉన్నా బాలయ్య సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతాడు. మొన్నటివరకు అందరు బాలయ్య అంటే యమా సీరియస్ అనుకునే వారు. కానీ తనలోని కామెడీ యాంగిల్ అందరికి ఈ మధ్యే తెలిసింది. ఆ క్రెడిట్ అన్ స్టాపబుల్ విత్ బాలయ్య షోకే దక్కుతుంది. ఈ ఓటీటీ షో నుండి సరికొత్త బాలయ్యని చూస్తున్నాం. పంచులు, జోకులు వేస్తూ నవ్వుతు అందరిని నవ్వించే డిఫరెంట్ బాలయ్యగా మారిపోయాడు. అయితే తాజాగా తండ్రి పోయిన బాధలో ఉన్న మహేష్ బాబు అండ్ ఫ్యామిలీని కాసేపు సరదాగా నవ్వించేశాడు బాలకృష్ణ. ఇంటికి పెద్ద దిక్కు లేకుండా పోయిన మహేష్ బాబు బాధ వర్ణనాతీతం. కృష్ణ ఆసుపత్రిలో చేరినప్పటి నుండి మహేష్ బాబుని ఓదార్చటం ఎవరి తరం కాలేదు. ఈ నేపథ్యంలో బాలయ్య ఒక్కరే మహేష్ ని కాస్త సరదాగా నవ్వించి రిలాక్స్ చేశాడని సూపర్ స్టార్ ఫ్యాన్స్ తెగ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.

అభిమానుల సందర్శనార్థం కృష్ణ భౌతికదేహాన్ని పద్మాలయ స్టూడియోలో పెట్టగా.. బాలకృష్ణ వచ్చి నివాళులు ఆరోపించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు అండ్ ఫ్యామిలీతో ఒక 10నిముషాలు ముచ్చటించాడు బాలయ్య. ఆ సమయంలోనే అక్కడ గౌతమ్ కృష్ణ మరియు గల్లా జయదేవ్ కూడా ఉన్నారు. మహేష్ బాబు తో బాలకృష్ణ మాట్లాడుతూ ఉన్న సమయంలో పక్కనే ఉన్న గౌతమ్ కృష్ణ ని చూసి.. మీ వాడు పెద్దోడు అయ్యాడు హీరోగా పరిచయం చేయవచ్చు అన్నట్లుగా పంచ్ వేశాడు. అప్పుడు గౌతమ్ తో పాటు మహేష్ బాబు కూడా మురిసిపోతూ నవ్వడం చూడవచ్చు. దుఃఖంలో ఉన్న మహేష్ బాబుకు తన కొడుకు గురించి మాట్లాడిన సమయంలో నవ్వు వచ్చిందని.. ఆ సమయం లోనే సంతోషంగా కూడా మహేష్ బాబు కనిపించారని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.