ఒకప్పుడు ఎక్కడో ఉన్నాం.. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? : బాలకృష్ణ - MicTv.in - Telugu News
mictv telugu

ఒకప్పుడు ఎక్కడో ఉన్నాం.. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? : బాలకృష్ణ

May 28, 2022

తెనాలిలో ఉన్న పెమ్మసాని థియేటర్లో 365 రోజులు రోజుకో ఎన్టీఆర్ సినిమా ఆడుతుందని నందమూరి బాలక‌ష్ణ వెల్లడించారు. యుగపురుషుడు ఎన్టీఆర్ శత జయంతి దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సాధించిన ఘనతలు, ప్రవేశపెట్టిన పథకాలు, రాజకీయాల గురించి మాట్లాడారు. అంతేకాక, అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం గుడినీ, గుడిలోని లింగాన్నీ మింగే రకం అని ఎద్దేవా చేశారు. ‘ఒక్క ఛాన్స్ అంటే ఓటు వేసి తప్పు చేశారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇకనైనా ఆత్మ విమర్శ చేసుకుందాం. ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి చూడండి. ఒకప్పుడు ఎక్కడో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? మీరే ఆలోచించుకోండి’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో బాలయ్యతో పాటు నటి ప్రభ, ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ తదితరులు పాల్గొన్నారు.