బాలయ్య సాయం .. రూ. 1.25 కోట్ల విరాళం - MicTv.in - Telugu News
mictv telugu

బాలయ్య సాయం .. రూ. 1.25 కోట్ల విరాళం

April 3, 2020

 Balakrishna Donates 1.25Cr to Fight Corona

టాలీవుడ్ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే పెద్దమనసు చాటుకున్నారు. కరోనా నివారణ, లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు, సినీ పరిశ్రమలోని పేద కార్మికుల కోసం కలిపి మొత్తం రూ. కోటీ 25 లక్షల సాయం ప్రకటించారు. ఈ విపత్కర సమయంలో ప్రతి ఒక్కరు ప్రభుత్వాలకు సహకరించి వైరస్ ముప్పు నుంచి తప్పించుకోవాలని ఆయన సూచించారు. కరోనాను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కరోనా పోరాటంలో భాగంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రూ. 50 లక్షల చొప్పున కేటాయించారు. ఇక సినీ పరిశ్రమలో పనులు లేక నిత్యావసరాల కోసం ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవడానికి రూ. 25 లక్షలు అందించారు. ప్రముఖ నిర్మాత,కరోనా క్రైసిస్ ఛారిటీ(సిసిసి) ఎగ్జిగ్యూటివ్ మెంబర్ సి. కళ్యాణ్‌కు చెక్కును అందజేశారు. లాక్ డౌన్ కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికులకు అండగా ఉంటామన్నారు.బాలయ్య సాయంపై  చిరంజీవి స్పందించారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని చెప్పారు.