బిగ్ బాస్ హౌస్ లో ‘తేడా సింగ్’ ? - MicTv.in - Telugu News
mictv telugu

బిగ్ బాస్ హౌస్ లో ‘తేడా సింగ్’ ?

August 25, 2017

అబ్బాయి హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ హౌస్ లో బాబాయ్ కాలు పెట్టబోతున్నాడా? ఏమో మరి  ‘పైసా వసూల్’ మూవీ ప్రమోషన్లు చూస్తే నిజమే అనిపిస్తోంది. ఇప్పటికే  పైసా వసూల్ సినిమాను  అన్ని విధాలుగా ప్రమోట్ చెయ్యాలని  చిత్ర యూనిట్ భావిస్తున్నారట. దానిలో భాగంగా బాలయ్య బిగ్ బాస్ హౌస్ కి వస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే నందమూరి అభిమానులకు పండగే పోన్రి.

ఇదివరకే రానా ‘నేనే రాజు,నేనే మంత్రి’  సినిమా ప్రమోషన్  కోసం బిగ్ బాస్ హౌస్ కి వచ్చాడు. ఆ తర్వాత  తాప్సీ ‘ఆనందో బ్రహ్మ’ సినిమా మూవీ ప్రమోషన్ కోసం వచ్చింది. రీసెంట్ గా  విజయ్ దేవరకొండ  కూడా  ‘అర్జున్ రెడ్డి’ సినిమా ప్రమోషన్ కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. చూస్తుంటే బిగ్ బాస్ హౌస్  మూవీ ప్రమోషన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారెతట్టుంది.