Balakrishna Fans Damaged AMB Mall In Das Ka Dhamki Trailer Launch
mictv telugu

మహేష్ బాబు AMB మాల్ ధ్వంసం.. బాలయ్య ఫ్యాన్స్ రచ్చ

November 19, 2022

స్టార్ హీరోల ఫ్యాన్స్ లో బాలయ్య ఫ్యాన్సే వేరు. ఏ పెద్ద హీరోకి లేని మ్యాడ్ ఫాలోయింగ్ బాలకృష్ణ సొంతం. గిల్లితే గిల్లించుకోవాలి అన్నట్టుగా.. బాలయ్య కొడితే కొట్టించుకోడానికి సైతం ఫ్యాన్స్ వెనుకాడరు. సినిమాకే కాదు బాలయ్య వ్యక్తిత్వానికి కూడా భారీ ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే వాళ్ళ ఆరాధ్యదైవం బాలయ్య ఎక్కడ కనిపించినా అభిమానుల హడావిడి ఆపలేం. బాలయ్యని ఎలాగైనా చూడాలన్న వారి ఆసక్తి ఒక్కోసారి ఇతరులకి ఇబ్బందులు కూడా కలుగజేస్తుంది. తాజాగా ఇలాంటి ఒక సంఘటన జరిగింది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిధిగా విచ్చేశారు. ఈ ఫంక్షన్ మహేష్ బాబుకి చెందిన AMB మాల్ లో అట్టహాసంగా జరిగింది. బాలయ్య రాక ముంగుగానే తెలుసుకున్న నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున AMB మాల్ కి తరలివచ్చారు. దీంతో వాళ్ళని ఆపటం సెక్యూరిటీ సిబ్బందికి తలకిమినిచ్చిన భారమైంది.మాల్ లోపాలకి త్వరగా వెళ్లాలన్న అతి ఉత్సాహంతో అభిమానులు మాల్ ని ధ్వసం కూడా చేసిపడేశారు.

అయితే ఎక్కువగా బయటి హీరోల ఈవెంట్స్ ప్రమోషన్స్ కి బాలయ్య వెళ్లరు. లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తాడు. కానీ ఈ మధ్య గేర్ మార్చి ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొని తాజాగా ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ కి హాజరయ్యారు. దాంతో బాలయ్యని బయట ఫంక్షన్స్ లో చూసే అరుదైన అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని పెద్ద ఎత్తున వచ్చిన ఫ్యాన్స్ ఏఎంబీ సినిమాస్ షటర్‌‌ను డ్యామేజ్ చేశారని సమాచారం. సెక్యూరిటీ సిబ్బంది షటర్‌ను ఎత్తుతుండగా బాలయ్య అభిమానులు ఒక్కసారిగా దూసుకొచ్చారట. ఒకరిపై ఒకరు పడుతూ, తోసుకుంటూ లోపలికి దూసుకెళ్లారట. ఈ క్రమంలో షటర్ దెబ్బతిన్నదని అంటున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే స్టార్ హీరోల సినిమా ఈవెంట్స్ లో ఇదంతా కామన్ అంటున్నారు AMB సిబ్బంది. ఇక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ‘దాస్ కా ధమ్కీ’ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.