స్పీడు పెంచిన బాలక్రిష్ణ - Telugu News - Mic tv
mictv telugu

స్పీడు పెంచిన బాలక్రిష్ణ

July 23, 2017

బాలయ్య బాబు సినిమాలు చేయటంలో స్పీడు పెంచాడు. పూరీ దర్శకత్వంలో వస్తున్న ‘ పైసా వసూల్ ’ మరో వారం రోజుల్లో షూట్ ఫినిష్ చేసుకోనుంది. అదే రోజు అటు గుమ్మడికాయ కొట్టి ఇటు కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో, సి. కళ్యాణ్ నిర్మాతగా సినిమాకు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చెయ్యనున్నాడు. ఎం. రత్నం అందించిన కథ బాలకృష్ణకు బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్టుకు పచ్చ జెండా వూపేసాడట. ఇంతకీ బాలయ్య పక్కన ఆయన ఎనర్జీకి తగ్గ స్టెప్పులు వేసే కథానాయిక ఎవరు అనుకుంటున్నారూ ? శ్రీరామరాజ్యం, సింహ సినిమాల్లో తన పక్కన నటించి సరైన జోడీ అనిపించుకున్న నయనతారే ఇందులో హీరోయిన్. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాట్ట. వచ్చే నెల 3 నుండి హైదరాబాదులో వేసిన సెట్లో సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. దీనితో 103 వ సినిమాగా తన ఖాతాలో జమ చేస్కుంటున్నాడు. ఈలోపు వేరే దర్శకులు బాలయ్య కోసం కథలు సిద్ధం చేస్కుంటే దీని గుమ్మడికాయ కొట్టేలోపు దాని కొబ్బరి కాయ కొడతాడు కాబోలు. ఎందుకంటే బాలయ్య బాబు ఇప్పుడు చాలా స్పీడు మీదున్నాడు. ఈ లెక్ఖన ఏడాదికి నాలుగు సినిమాలు చేసేలా వున్నాడు. ఇదే స్పీడును కంటిన్యూ చేస్తే ఈ ఐదారేళ్ళలో 150 సినిమాల్లో నటించిన చిరంజీవిని బీటు కొట్టడం ఖాయం అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్.