నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీపై గత కొద్ది రోజులుగా చర్చ నడుస్తోంది. మోక్షజ్ఞ ఎంట్రీపై రకరకాల వార్తలు వచ్చి పోతున్నాయి. కానీ ఇంతవరకు అతడి ఎంట్రీ జరగలేదు. లవ్ స్టోరీతో వస్తున్నాడు..యాక్షన్ మూవీతో వచ్చేస్తున్నాడు అంటూ ఎవరికి తోచిన విధంగా వారు ప్రచారం చేశారు. కానీ అధికారక అప్డేట్ రాలేదు. తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీపై బాలకృష్ణ క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే ఏడాది మోక్షజ్ఞను పరిచేయం చేస్తున్నట్టు ప్రకటించారు. గోవా ఫిలిం ఫెస్టివల్లో అఖండ చిత్రం ప్రదర్శనలో పాల్గొన్న బాలకృష్ణ.. మాటల సందర్భంలో మోక్షజ్ఞ ఎంట్రీపై స్పందించారు. అయితే మోక్షజ్ఞ చిత్రానికి దర్శకుడు ఎవరన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తొలి సినిమా ఉంటుందా? అన్న ప్రశ్నకు తనదైన శైలిలో అంతా దైవేచ్ఛ అంటూ సమాధానం ఇచ్చి నవ్వేశారు.
మరోవైపు అఖండ-2 గురించి కూడా బాలయ్య కొత్త అప్డేట్ చెప్పారు. “అఖండ 2” మూవీ తప్పకుండా ఉంటుందని.. ఇప్పటికే సబ్జెక్టు కూడా సిద్ధం చేశామని, ప్రకటించడం ఒక్కటే మిగిలి ఉందని తెలిపారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి చిత్రంలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఇటీవలే ఆ చిత్రానికి సంబంధంచిన పాటను విడుదల చేసి అభిమానులను అలరించారు. ఈ చిత్రం సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది.