balakrishna gets emotional over hero siddu jonnalagadda comments in unstoppable with nbk
mictv telugu

‘డీజే టిల్లు’కు అవమానం.. అందరిముందు బాలయ్య కన్నీళ్లు

October 20, 2022

బాలకృష్ణలోని సరికొత్త కామెడీ యాంగిల్‌ను బయటికి తీసుకొచ్చిన షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్ బీకే’. అల్లరి మాటలు, కొంటె పనులు, సూటి ప్రశ్నలు, అన్నింటికీ మించి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఈ షోను సక్సెస్ చేశాయి. అల్లు అరవింద్ ‘ఆహా’ యాప్‌లో ఈ షోని తెగ చూస్తున్నారు జనాలు. అన్ని రకాల ప్రేక్షకులను తన హుషారు మాటలతో కట్టిపడేసాడు బాలయ్య. అయితే డేర్ అండ్ డ్యాషింగ్ అని పేరున్న బాలయ్య ఈ షోలో తొలిసారి ఉద్వేగానికి గురయ్యాడు. ఓటీటీలో చంద్రబాబుతో చేసిన అన్‌స్టాపబుల్ సీజన్ 2 తోలి ఎపిసోడ్ రికార్డ్ వ్యూస్‌తో దూసుకుని పోతుండగా.. రెండో ఎపిసోడ్‌కి సంబంధించిన రెండో ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ఎపిసోడ్ కి యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ గెస్టులుగా వచ్చారు. ఆ ప్రోమోలో.. ‘మీరు మాస్ కా దాస్’ అయితే నేను ‘బాస్ ఆఫ్ మాస్’ అంటూ యువ హీరోలతో బాలయ్య చేసిన సందడి చూపెట్టగా.. రెండవ ప్రోమోకి కాస్త ఎమోషనల్ టచ్ ఇచ్చింది ఆహ టీమ్.

రెండవ ప్రోమోలో డీజే టిల్లు చెప్పిన సినిమా కష్టాలు విని బాలయ్య ఎమోషనల్ అయ్యారు. ఇండస్ట్రీలో మీకు ఏమైనా అవమానాలు ఎదురయ్యాయి అని అడిగిన బాలయ్య ప్రశ్నకి సిద్దు జవాబిస్తూ.. ‘నేను హీరోగా చేద్దాం అన్నా అని ఓ వ్యక్తి దగ్గరకు వెళ్తే.. ఏంటి ఈ ముఖంతోనే హీరో అయిపోదాం అనుకుంటున్నావా? అని అవమానించారు అని చెప్పి సిద్దు ఎమోషనల్ అవుతుంటే.. అది విన్న బాలకృష్ణ కల్లు చెమ్మగిల్లాయి. దాంతో బాలయ్య దుఃఖం ఆపుకోలేక నాకు కన్నీళ్లు వస్తున్నాయి అని అనేశారు. ఆ తరువాత ‘నువ్ అక్కడితో ఆపేసి ఇటు రామ్మా’ అని.. సిద్దు జొన్నలగడ్డలను గుండెలను హత్తుకున్నారు బాలయ్య. ఆ తరువాత విశ్వక్ సేన్.. తన సిస్టర్ ఆరోగ్యం బాలేకపోతే తాను పడ్డ స్ట్రగుల్‌ని చెప్పి ఎమోషనల్ అయ్యాడు. ఓ వైపు అక్క.. మరోవైపు సినిమా.. ఎవర్నీ వదల్లేక ఏడ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు విశ్వక్ సేన్.