Balakrishna Hot Comments On Siddarth Aditi Rao Hydari Relation In Unstoppable With NBK Season 2 Show
mictv telugu

సిద్దార్థ్, అదితిల సహజీవనం.. బాలకృష్ణ హాట్ కామెంట్స్

November 5, 2022

బాలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ లో సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలపై చర్చ కాస్త తక్కువగానే ఉంటాయి. కానీ రేటింగ్స్ కోసమో లేక ట్రెండ్ ఫాలో అవుతున్నారో కానీ తెలుగు మీడియాలో సైతం పర్సనల్ మ్యాటర్స్ ని ఓపెన్ గా డిస్కర్స్ చేసుకుంటున్నారు. ఎఫైర్స్, డేటింగ్ లాంటి మసాలా మ్యాటర్లని రివీల్ చేయడానికి బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ షో ఉంటే.. ఇప్పుడు బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్ విత్ బాలయ్య’ షో కూడా అలానే తయారైందని కామెంట్స్ వస్తున్నాయి. ‘ నువ్వు నిన్న రాత్రి ఏ హీరోయిన్ తో పడుకున్నావ్, నీకు పెళ్ళైన ఏ హీరోయిన్ అంటే క్రష్, ఎన్నిసార్లు ఎవరితో ఎక్కడెక్కడ చేశావ్’ అనే చెండాలాన్ని సిగ్గు లేకుండా అడగటంలో కరణ్ జోహార్ సిద్దహస్తుడు. అయితే బాలయ్యకి కూడా దైర్యం ఎక్కువ అంటారు. ఎవరితోనైనా ఎలాంటి ప్రశ్ననైనా అడిగేస్తాడని బాలయ్యకి పేరుంది. తాజాగా తన పేరుని మరోసారి నిరూపించుకుంటూ.. గుట్టుచప్పుడు కాకుండా డేటింగ్ చేసుకుంటున్న ఒక జంటని పబ్లిక్ లోకి లాగేశాడు బాలయ్య. ఆ జంట మరెవరో కాదు.. ఏజ్ బార్ హీరో సిద్దార్థ్, హైదరాబాదీ బ్యూటీ అదితి రావు. వీరిద్దరూ కలిసి చేసిన మహాసముద్రం డిజాస్టర్ అయింది. శర్వానంద్ హీరోగా చేసిన ఈ మూవీలో ముఖ్యపాత్రలో సిద్దార్థ్ అతనికి జోడిగా అదితి రావు నటించిది. ఈ విషయాన్నే ‘అన్ స్టాపబుల్’ షోకి గెస్టుగా వచ్చిన శర్వాని అడిగేస్తాడు బాలయ్య.

మొన్న అదితి పుట్టినరోజు సందర్భంగా ‘నా హృదయపూర్వక యువరాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ పోస్ట్ పెట్టి.. మహాసముద్రంలో సిద్ధుతో అదితి కలిసున్న ఫోటోని షేర్ చేశాడు శర్వా. అయితే ఇదే విషయమపై బాలయ్య శర్వానంద్‌ను ప్రశ్నించారు. అదితి రావు హైదరి సంగతేంటి? అని బాలయ్య అడగ్గా.. అందుకు శర్వా ‘ఆవిడ ‘మహాసముద్రం’ లో నాకు జంటగా నటించలేదు. సిద్ధార్థ్ కు జంటగా నటించింది’ అంటూ శర్వానంద్ బదులిచ్చాడు. దానికి బాలయ్య ‘రియల్ లైఫ్ లో కూడా ఆమె సిద్దార్థ్ కు జంటగా మారిందా?’ అంటూ మళ్ళీ శర్వాని ప్రశ్నించాడు. దీనికి శర్వా సమాధానం ఇస్తూ… ముందు నాకు తెలీదు అని చెప్పి ‘ఇంస్టాగ్రామ్ లో తన హృదయపూర్వక యువరాణి కామెంట్ చేశారని, అందువల్ల నేను ఇలా మాట్లాడుతున్నానని’ శర్వానంద్ చెప్పుకొచ్చారు. ‘అంటే పలికిందంటావా’ అంటూ బాలయ్య అడగ్గా.. అందుకు శర్వా ‘ఏమో పలికిందేమో’ అంటూ చెప్పాడు. అయితే సిద్దు అదితి జంట ముంబైలో సహజీవనం చేస్తున్నారని బీ టౌన్ టాక్. ముంబై వీధుల్లో ఈ జంట షాపింగ్స్ చేస్తూ మీడియాకి చిక్కిన ఫోటోలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. అయితే మొన్న అదితి పుట్టినరోజు వేడుకలని చెన్నైలో సిద్దార్థ్ ఘనంగా నిర్వహించడాని టాక్. వీళ్లిద్దరు త్వరలో పెళ్ళికి కూడా సిద్దమైనట్టు చెన్నై సర్కిల్స్ లో పెద్దఎత్తున రూమర్స్ వినపడుతున్నాయి.