క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమాలో బాలకృష్ణ అనే నటుడిని కీలక పాత్రలో నటింపజేస్తున్నారు. బాలకృష్ణ అనే వ్యక్తి కేజీఎఫ్ సినిమాలో నటించాడు. తెలుగువాడైన ఈయన దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు బంధువు. కేజీఎఫ్ సినిమాల్లో ఇనాయత్ ఖలీల్ అనే పాత్రలో నటించాడు. తాజాగా పవన్ కల్యాణ్ సినిమాకు సంబంధించిన విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘దర్శకుడు క్రిష్ నేను నటించిన మస్తీన్ అనే వెబ్ షోలో నన్ను చూసి పవన్ సినిమాలో అవకాశం ఇచ్చారు. రాజదర్బార్‌లో మంత్రి పాత్ర ఇచ్చాడు. హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓడ సెట్ వేసి ఔరంగజేబు పాత్రధారి అయిన బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌పై దాడి చేసే సన్నివేశాలు చిత్రీకరించారు. శ్రీధర్ సీపాన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ నటిస్తున్న చిత్రంలో చేస్తున్న విలన్ పాత్ర అద్భుతంగా ఉంటుంద’ని వివరించారు.