నవయవ్వన బాలయ్య.. కేక పుట్టిస్తున్న కొత్త ఫిజిక్! - MicTv.in - Telugu News
mictv telugu

నవయవ్వన బాలయ్య.. కేక పుట్టిస్తున్న కొత్త ఫిజిక్!

November 9, 2019

నందమూరి బాలకృష్ణ  ‘రూలర్’ చిత్రం కోసం సన్నబడ్డం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన లుక్ అభిమానులను అంతగా అకట్టుకోలేదు. దీంతో ఈసారి కొత్త లుక్ విడుదల చేశారు. దీన్ని చూసిన వాళ్లు ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఇందులో బాలయ్య పాతికేళ్ల కుర్రాడిలా స్లిమ్‌ ఫిజిక్‌తో చేతులు చాచి నిలబడ్డాడు. క్యాస్టూమ్స్ కూడా చక్కగా అమరాయి. కుర్రకారు ఇటీవల బెల్టుకు బదులు నాడా కట్టుకున్న ఫ్యాషన్‌ను బాలయ్య కూడా అనుకరించారు. సినిమా కోసం బాలయ్య ఒకరకంగా పరకాయ ప్రవేశం చేసినట్లు కనిపిస్తోంది. త్వరలోనే చిత్రం టీజర్ విడుదల చేస్తున్నట్లు పోస్టర్‌పై రాశారు.  

సి. కళ్యాణ్ నిర్మాణ సారథ్యంలో కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో వస్తున్న ‘రూలర్’ చిత్రంలో బాలయ్య సరజన సోనాల్‌ చౌహాన్‌, వేదికలు జట్టుకట్టారు. ప్రకాశ్‌రాజ్‌, భూమిక ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబరు 20న విడుదల కానుంది. ‘ఎన్టీఆర్‌’ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు ఆకట్టుకోకపోవడంతో బాలయ్య కసితో ఈ సినిమా చేస్తున్నారు.