టాలీవుడ్ సీనియర్ హీరో కం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. వీర సింహారెడ్డి సక్సెస్ మీట్‌లో ఆ రంగారావు ఈ రంగారావు అక్కినేని తొక్కినేని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ మాటలపై విమర్శలు రాగా, అక్కినేని మనవళ్లు కూడా బాలయ్యను ఖండించారు. దీనిపై మీడియా వివరణ అడగ్గా.. అదేదో ఫ్లోలో వచ్చిందని, అక్కినేని అంటే తనకు ఎంతో గౌరవమని వెల్లడించారు. బాబాయ్ అక్కినేని పొగడ్తల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎప్పుడూ తనను హెచ్చరిస్తుండేవారని గుర్తు చేసుకున్నారు. నాన్నగారి పేరిట ఏర్పాటు చేసిన అవార్డును తొలిసారి ఆయనకు ఇచ్చిన సంగతిని పునరుద్ఘాటించారు. అయితే ఈ క్రమంలోనే బాలయ్య మరో వివాదానికి తెర తీశారు. ‘అక్కినేని నన్ను పిల్లాడిలా చూసుకునేవారు.
నా మీద ప్రేమ, ఆప్యాయత చూపించేవారు. ఎందుకంటే అక్కడ (అక్కినేని ఇంట్లో) లేని ఆప్యాయత ఇక్కడ ఉంది కాబట్టి. గుర్తు పెట్టుకోండి’ అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఒక వివాదానికి వివరణ ఇస్తూనే మరో వివాదాన్ని సృష్టించడమేంటని విమర్శలు అక్కినేని అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే బాలయ్య హిందూపురానికి వెళ్లారు. అక్కడ సరస్వతి విద్యా మందిర్‌లో విద్యార్ధులకు కంప్యూటర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాయలసీమలో ఉద్యోగాలు లేక యువత వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనను విమర్శించారు. అలాగే ‘ఎవరైనా నా వయసు 60 ఏళ్ళు అంటే వారికి దబిడి దిబిడే’ అంటూ తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. అనంతరం విద్యార్ధులతో చదువు, ఉద్యోగం, కెరీర్ గురించి మాట్లాడారు. చదువు పూర్తయిన తర్వాతే నటనలోకి రావాలని, ఒకవేళ సినిమాల్లో ఫెయిలయినా చదువు ఉంది కాబట్టి ఏదో ఉద్యోగం చేసుకుని బతకొచ్చని నాన్నగారు చెప్పేవారని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
‘తొక్కినేని’ని తేలిగ్గా తీసిపారేసిన బాలయ్య
హీరో శర్వానంద్ ఎంగేజ్‌మెంట్.. అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ పెద్దదే..