టాలీవుడ్ టాప్ హీరో బాలయ్య బాబు మరో టాప్ హీరో అక్కినేనిపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఆ పేరును కించపరిచేలా వాడి అక్కినేని అభిమానుల ట్రోల్‌కి గురవుతున్నాడు. సంక్రాంతికి వీర సింహారెడ్డితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని జోష్ మీదున్న బాలయ్య.. ఆదివారం చిత్ర సక్సెస్ మీట్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి బాలయ్యతో పాటు హనీరోజ్, విష్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, హను రాఘవపూడి, శివ నిర్వాణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ అక్కినేని.. తొక్కినేని అని సంబోధించడం వివాదానికి కారణమైంది. ‘మా ఆర్టిస్టులు నాకు మంచి టైంపాస్. వేదాలు, శాస్త్రాలు, నాన్నగారు, ఆ రంగారావు, ఈ రంగారావు, అక్కినేని, తొక్కినేని.. ఇవన్నీ కూర్చుని మాట్లాడుకునేవాళ్ల’మంటూ అనేశారు. అయితే ఆదివారం అక్కినేని వర్ధంతి కావడంతో నాగార్జున కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడారని అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2014 జనవరి 22వ తేదీన అక్కినేని నాగేశ్వరరావు మరణించారు. అదే రోజు బాలయ్య ఇలా మాట్లాడడం యాథృచ్ఛికంగా జరిగిందో లేక ఉద్దేశపూర్వకంగా అన్నారో తెలీదు కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన ట్రోలింగ్‌కి గురవుతున్నారు బాలయ్య.
ఇవి కూడా చదవండి :
సినిమాలను నిషేధిస్తే మీ పరిస్థితి ఏంటి? – కరీనా కపూర్
రిపబ్లిక్ డే సందర్భంగా ఈ వారం థియేటర్ / ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..