నాకు హిందీ బాగా వచ్చు.. మోదీని తిట్టలేదు.. బాలకృష్ణ - MicTv.in - Telugu News
mictv telugu

నాకు హిందీ బాగా వచ్చు.. మోదీని తిట్టలేదు.. బాలకృష్ణ

April 23, 2018

ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం సీఎం చంద్రబాబు చేసిన ధర్మపోరాట దీక్షలో తాను ప్రధాని నరేంద్రమోదీని పచ్చిబూతులు తిట్టనే లేదని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ చెప్పారు. ‘కొన్ని మీడియా సంస్థలు నా ప్రసంగం వీడియోను మార్ఫింగ్ చేశాయి. నేను ఆయనను ఏమీ అనలేదు. నాకు హిందీ రాదని అంటున్నారు. కానీ తప్పు.. నాకు హిందీ చాలా బాగా వచ్చు.. ’ అని ఆయన పేర్కొన్నారు.  బాలయ్య ఆదివారం చిలకలూరి పేటలో జరిగిన తన ‘జైసింహా’ సినిమా శతదినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఏపీ ప్రజల బాధ దేశానికంతా అర్థం కావాలనే తాను హిందీలో మాట్లాడాడని, మోదీని అసభ్యంగా తిట్టనేలేదని అన్నారు. దేశ ప్రధానిని బండబూతులు తిట్టిన బాలయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు బీజేపీ నేతలు కేసులు పెట్టడం తెలిసిందే.