ఫ్యాక్షన్ కథలకు బాలయ్యకు అవినాభావ సంబంధం ఉంది. సమరసింహారెడ్డి వంటి హిట్స్ కొట్టిన బాలయ్య ‘అఖండ’విజయం తర్వాత మళ్లీ ముఠా కక్షలపై చూపు సారించారు. తన 107వ మూవీని బ్లడ్ బాత్‌తో తెరకెక్కిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా బయటికి వదిలారు.
‘మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్, నా జీవో గాడ్స్ ఆర్డర్.. భయం నా బయోడేటాలోనే లేదురా’ వంటి బాలయ్య మార్క్ పంచు డైలాగుతో ఈ టీజర్ అభిమానులను అలరిస్తోంది. నల్ల దుస్తుల్లో ఏదో దీక్షలో ఉన్న బాలయ్య గొడ్డలితో నరుకుతున్న దృశ్యం, జీపులు, పల్లె వాతావరనం, నరసింహస్వామి విగ్రహం వంటివి ఇది బ్రాండెడ్ కథను తలపిస్తున్నాయి. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. తమన్ సంగీతంతో వస్తున్న ఈ చిత్రాన్ని దసరాకరు విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.