balakrishna new talk show plans in netflix
mictv telugu

బాలయ్యపై కార్పొరేట్ కన్ను.. ఆహ నుండి నెట్ ఫ్లిక్స్ జంప్ ?

December 31, 2022

నందమూరి బాలకృష్ణలోని సరికొత్త కామెడి యాంగిల్ ని తెలుగు ఆడియన్స్ కి పరిచయం చేసిన టాక్ షో అన్ స్టాపబుల్. అల్లు అరవింద్ ఏ ముహూర్తాన ఇది ప్లాన్ చేశారో కానీ బాలయ్య జాతకం ఒక్కసారిగా తిరిగిపోయింది. అప్పటివరకు అడపాదడపా బోయపాటి శ్రీనుతో హిట్లు కొడుతూ సాదాసీదా కెరీర్ కొనసాగించే బాలక్రిష్ణని యూత్ కి దగ్గర చేసింది ఆహ. వ్యక్తిగతంగా బాలయ్య మాస్ ఇమేజ్ నెక్స్ట్ లెవెల్ అయినా.. కెరీర్ లో అన్ స్టాపబుల్ టాక్ షోతో మరోస్థాయికి చేరారు బాలకృష్ణ. సరిగ్గా ఈ క్రేజ్ పై కార్పొరేట్ కన్ను పడింది. ఆహ అన్ స్టాపబుల్ తో మ్యాజిక్ చేసిన బాలకృష్ణని ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ బుట్టలో పడేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.

తాజాగా అన్ స్టాపబుల్ షో సక్సెస్ చూసి.. బాలయ్యతో ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ కూడా ఓ బిగ్ షో ప్లాన్ చేస్తోందని సమాచారం. అయితే.. ఆడియెన్స్ పరంగా ఆహా కంటే ‘నెట్ ఫ్లిక్స్’ పెద్దది కాబట్టి.. బాలయ్యతో షో అంటే ప్రపంచ దేశాలు చూసేలా ఉండబోతుందని టాక్. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉండగా.. బాలయ్యతో నెట్ ఫ్లిక్స్ షో రాబోతుందని కథనాలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం బాలయ్య వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి రేసులో ముందుంది. జనవరి12న థియేటర్స్ లో విడుదల కానుంది వీరసింహారెడ్డి.