తెలుగు చిత్రసీమ పరిశ్రమలో నటసింహంగా పేరుగాంచిన నందమూరి బాలకృష్ణ టర్కీలో సందడి చేశారు. తన అభిమాన కుటుంబంతో కలిసి భోజనం చేశారు. భోజన సమయంలో బాలకృష్ణ.. ఆ కుటుంబ సభ్యులతో సరదాగా నవ్వుతూ, అనేక విషయాలపై చర్చించారు. ప్రస్తుతం బాలకృష్ణ వారితో ముచ్చటించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘ముందుగా హేభాయ్ టిఫిన్ చేసేసా, ఇక మందులు వేసుకోవాలి’ అంటూ బాలయ్య నవ్వుతూ, వారిని పలకరించారు. ఆ తర్వాత ”ఆడవాళ్లు ఇంట్లో కూర్చుని టీవీ సీరియళ్లు చూస్తూ, మెదడు పాడు చేసుకుంటారు. నా ఉద్దేశం ప్రకారం టీవీ తక్కువ చూస్తే కళ్లకు మంచిది. అసలు చూడకపోతే మెదడుకి మంచింది” బాలకృష్ణ వారితో సరదాగా మాట్లాడారు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం టర్కీలో జరుగుతుంది. ఈ క్రమంలో తన అభిమాన కుటుంబం ఆయనతో టిఫిన్ చేయాలని కోరడంతో..బాలకృష్ణ వారితో కలిసి భోజనం చేశారు.
Balakrishna at a Restaurant in Turkey…#Balakrishna #NandamuriBalakrishna @NANDAMURIFANS1 @MythriOfficial @balakrishnafabs pic.twitter.com/ookLVnIz4x
— SubbaraoN (@subbaraon) August 31, 2022
ఇక, బాలకృష్ణ విషయానికొస్తే..ఆయన మనసు గురించి చాలా మందికి తెలుసు. పలు సందర్భాల్లో ఆయన ఫ్యాన్స్‌పై చేయి చేసుకోవడం చూసి, కొంతమంది ఆయనకు ఆవేశం ఎక్కువ అనుకుంటూ ఉంటారు. కానీ, ఆయన గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆయన చాలా సరదా మనిషి. అలాగే, వెన్నెలంటి మనసున్న మనిషి. చాలా సందర్భాల్లో బాలయ్య తన మంచి మనసును చాటుకున్నారు. ఇటీవలే బాలకృష్ణ తన అభిమాని కుటుంబంతో కలిసి భోజనం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి టర్కీలో మరో కుటుంబంతో కలిసి ఆయన భోజనం చేశారు.