బాలయ్యకు ఏపీ ప్రభుత్వం వరుస షాకులు.. ఏమైందంటే - MicTv.in - Telugu News
mictv telugu

బాలయ్యకు ఏపీ ప్రభుత్వం వరుస షాకులు.. ఏమైందంటే

April 5, 2022

bbbb

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఏపీ ప్రభుత్వం వరుస షాకులు ఇస్తోంది. కొత్త జిల్లాల పునర్విభనలో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బాలయ్య ఇటీవల ఆందోళన నిర్వహించారు. ప్రజలతో కలిసి మౌన దీక్షలో కూడా పాల్గొన్నారు. హిందూపురం జిల్లా కోసం అవసరమైతే సీఎం జగన్‌ను కూడా కలుస్తానని బహిరంగంగా ప్రకటించారు. అయితే నిన్న జరిగిన కొత్త జిల్లాల ప్రకటనలో హిందూపురం జాడ లేదు. పుట్టపర్తిని జిల్లాగా చేశారు. ఇదొక షాక్ అయితే ఇటీవల బాలయ్య పీఏ బాలాజీ మందు కొడుతూ, పేకాట ఆడుతూ దొరికిపోయారు. ఓ బార్ అండ్ రెస్టారెంటులో బాలాజీతో పాటు వైసీపీ నేతలు కూడా పట్టుబడ్డారు. పోలీసులు విషయం తెలుసుకొని రెడ్ హ్యాండెడ్‌గా బాలాజీని పట్టుకుని రిమాండుకు తరలించారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వ ఉపాధ్యాయుడైన బాలాజీ డిప్యుటేషన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. హిందూపురంలో బాలయ్య బాబు స్థానికంగా ఎప్పుడూ అందుబాటులో ఉండరు కాబట్టి, నియోజకవర్గ నాయకులు బాలాజీపైనే ఆధారపడుతుంటారు. కానీ, ప్రత్యర్ధి నేతలతో పేకాట ఆడుతూ దొరికిపోవడంతో బాలయ్య ఇక నియోజకవర్గంపై స్వయంగా దృష్టి సారించారని సన్నిహితులు చెప్తున్నారు.