balakrishna Reacts On controversial comments on akkineni
mictv telugu

‘తొక్కినేని’ని తేలిగ్గా తీసిపారేసిన బాలయ్య

January 26, 2023

Balakrishna reacts to controversial comments on Akkineni

వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో తాను చేసిన అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై నందమూరి బాలక‌ృష్ణ స్పందించారు. ఆ మాట యాధృచ్ఛికంగా వచ్చిందని స్పష్టం చేశారు. ఇండస్ట్రీకి అక్కినేని, నందమూరి రెండు కళ్లవంటి వారన్నారు. నాన్నగారి నుంచి క్రమశిక్షణ, అక్కినేని నుంచి పొగడ్తలకు పొంగిపోకపోవడం నేర్చుకున్నానని తెలిపారు. నాన్నగారి పేరిట ఏర్పాటు చేసిన అవార్డును తొలిసారి అక్కినేనికి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బాబాయ్ (అక్కినేని నాగేశ్వరరావు)పై ప్రేమ గుండెల్లో ఉంటుందని, ఫ్లోలో వచ్చే మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

‘బయట ఏం జరిగినా పట్టించుకోను. ఫ్లోలో వచ్చే మాటలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదు’ అని కరాఖండీగా చెప్పేశారు. అటు ఎస్వీ రంగారావు మనవళ్లు బాలయ్య మాటలపై స్పందించారు. బాలయ్య మాట్లాడిన దాంట్లో ఎలాంటి వివాదం తమకు కనపడలేదని వీడియో ద్వారా తెలియజేశారు. బాలకృష్ణకు తమకు మధ్య మంచి అనుబంధం ఉందని, దయచేసి దాన్నిచెడగొట్టే ప్రయత్నం చేయవద్దని కోరారు. తామంతా ఒక కుటుంబంలా ఉంటామని, మీడియా ఈ విషయాన్ని సాగదీయవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి :

హీరో శర్వానంద్ ఎంగేజ్‌మెంట్.. అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ పెద్దదే..

విదేశాల్లో ఆర్ఆర్ఆర్‌కు ఎందుకంత క్రేజ్?