నంద్యాలలో నందమూరి బాలయ్య..! - MicTv.in - Telugu News
mictv telugu

నంద్యాలలో నందమూరి బాలయ్య..!

August 16, 2017

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా  ఈరోజు బాలకృష్ణ రోడ్ షో నిర్వహించారు.రోడ్ షోలో బాలయ్య మాట్లాడుతు రాష్ట్రాభివృద్దికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని బాలయ్య చెప్పారు.నంద్యాల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని.. ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రైతులకు రుణాల నుంచి విముక్తి కల్పించిన ఘనత తెదేపా ప్రభుత్వానిదేనని బాలకృష్ణ తెలిపారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం చేసే అన్ని పనులను అడ్డుకోవడమే ప్రతిపక్షం లక్ష్యంగా పెట్టుకుందని బాలకృష్ణ విమర్శించారు. ప్రజలకు మంచి చేసే పనులపై సూచనలు ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వాన్ని విమర్శించడమే విపక్ష నేతలు పనై పోయిందని అన్నారు. ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు.