Balakrishna shines in his first-ever commercial for Sai Priya Group’s 116 Paramount
mictv telugu

ఫస్ట్ టైమ్.. యాడ్‌లో ఇరగదీసిన బాలయ్య

October 28, 2022

బాలయ్యకు రెండో యవ్వనం వచ్చేసి చాలా రోజులే అయ్యింది. కుర్రనటులకు ఏ మాత్రం తీసిపోకుండా డ్యాన్సులు, డైలాగులతో రెచ్చిపోతున్నారు. ‘అఖండ’ మూవీ సక్సెస్ కావడంతో మాంచి జోరుమీదున్న బాలకృష్ణ బుల్లితెరపైన ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ ప్రోగ్రామ్‌తో దూసుకెళ్తున్నారు. తాజాగా ఆయన మరో కలకలం రేపాడు. ఓ వాణిజ్య ప్రకటనలో నటించారు. ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీ సాయి ప్రియ గ్రూప్ ఈ యాడ్ రూపొందించింది. విమానంలో, కారులో వెళ్తున్న బాస్‌గా బాలయ్య కేక పుట్టించారు. యాడ్‌లోని రోల్స్ రాయిస్ కారుకరు ‘ఎన్బీకే1’ అని రాసుంది. బాలయ్య ఓ వాణిజ్య ప్రకటనంలో నటించడం బహశా ఇదేసారి కావొచ్చు. శతాధిక సినిమాలు చేసిన బాలయ్య ఇలాంటి యాడ్స్‌లోనూ అరంగేట్రం చేయడంతో ఫ్యాన్స్ తెగ సంబరిపోతున్నారు. ఆయన ఇమేజీ బ్రాండ్‌ను దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలే ఇప్పటికే బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోడానకి ప్రతిపాదనలతో వెళ్తున్నట్లు సమాచారం.