balakrishna son mokshagna tollywood entry with hit 3 movie
mictv telugu

బాలయ్య సంచలనం.. హిట్ 3 రేసులో నందమూరి మోక్షజ్ఞ ?

December 5, 2022

నందమూరి అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అంశం మోక్షజ్ఞ సినీ ఎంట్రీ. ఒకవైపేమో అగ్రహీరోల కొడుకులు స్టార్ హీరోలుగా వెలుగుతుంటే బాలకృష్ణ కొడుకు కనీసం తెరంగ్రేటం కూడా చేయకపోవటం కాస్త విచిత్రమే. అయితే బాలకృష్ణ కారణంగానే మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యం అవుతుందని అంటారు. ఎలాంటి కథతో కొడుకుని ఇంట్రడ్యూస్ చేయాలో బాలయ్యకి క్లారిటీ లేకపోవటమే రీజన్ గా చెప్తారు. ఆది లాంటి ఫ్యాక్షన్ సబ్జెక్టుకి వెళ్లాలా.. ఆదిత్య 369 వంటి ప్రయోగం చేయాలా లేక మంచి కమర్షియల్ కథతో ముందుకెళ్లాలా అన్న అయోమయం ఉందంటూ సన్నిహితులతో బాలయ్య తరచుగా చెప్తుండేవాడట. అయితే తాజాగా కొడుకు మోక్షజ్ఞ మొదటి చిత్రంపై బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నాడని.. అదే సేన్సేషనల్ హిట్ ఫ్రాంచైజ్ తో కొడుకుని సినీ రంగప్రవేశం చేయించాలని ఆలోచిస్తున్నాడట. ఇప్పటికే హిట్, హిట్2 చిత్రాలు యువతని ఆకట్టుకున్నాయి. క్రైమ్ థ్రిల్లర్స్ సినిమాలని ఒక వర్గం వారే చూస్తారని తెలిసినా.. బాలయ్య హిట్ ఫ్రాంచైజ్ వైపే మొగ్గు చూపెడుతున్నాడట.

అయితే బాలయ్య ఆలోచనలకి కారణం కూడా లేకపోలేదు. నందమూరి మూడవ తరం వారసుడిగా, బాలకృష్ణ కొడుకుగా మోక్షజ్ఞపై తారా స్థాయిలో అంచనాలు ఉంటాయి. ఖచ్చితంగా మొదటి చిత్రం హిట్ అవ్వాల్సిందే. లేదంటే అఖిల్ పరిస్థితి తప్పదు. ఇలాంటి సిచువేషన్ లో యాక్షన్, కమర్షియల్, ప్రయోగాత్మక చిత్రాల కంటే మినిమమ్ గ్యారెంటీ ఉండే క్రైమ్ థ్రిల్లర్స్ అయితే కొడుకుకి బెటర్ అని బాలయ్య భావిస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్. అందుకే నిన్న రాత్రి హిట్ 2 ప్రివ్యూకి సైతం బాలయ్య హాజరయ్యి చిత్ర యూనిట్ ని ప్రశంసించాడని అంటున్నారు. అయితే ఇందులో కొసమెరుపు ఏంటంటే.. ప్రివ్యూకి స్వయంగా కొడుకు మోక్షజ్ఞని కూడా వెంటపెట్టుకుని వెళ్ళాడు బాలకృష్ణ. మొన్నటి అన్ స్టాపబుల్ విత్ NBK షోలో అడివి శేష్ తో కూడా మోక్షజ్ఞ ఎంట్రీపై చర్చ జరిగిందట. శేష్ కూడా హిట్ ఫ్రాంచైజ్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే యూత్ లో మంచి క్రేజ్ వస్తుందని.. తానూ దెగ్గరుండీ బాధ్యతలని చూసుకుంటానని కూడా మాటిచ్చారట. ఇక నిన్న బాలయ్య హిట్ -2′ సినిమా చూడటం..దాన్ని బాగుందని మెచ్చుకోవడం.. ఆపై సినిమా టీమ్ తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.