ప్రేక్షక దేవుళ్లకు జోహార్లు అర్పించిన బాలయ్య...! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేక్షక దేవుళ్లకు జోహార్లు అర్పించిన బాలయ్య…!

August 18, 2017

నిన్న ఓ అభిమాని దౌడ వలగ్గొట్టిన బాలయ్య,సాయంత్రం ఖమ్మంలో జరిగిన పైసా వసూల్ ఆడియో ఫంక్షన్లో ప్రేక్షక దేవుళ్లకు ప్రేమతో జోహార్లు చెప్పారు.వానకురిసినా,తడుసుకుంటూ ఆడియో ఫంక్షన్ కి వచ్చిన ప్రేక్షకులకు నా జోహార్లు, కృతజ్ఱతలు అంటూ బాలయ్య అన్నారు.గొంతు ఎండి పోతున్నా,బొంగురు పోతున్నా ప్రేక్షక దేవుళ్లపై ప్రేమతో ఏకధాటిగా దాదాపు అర్ధగంట మాట్లాడారు బాలయ్య…పైసా వసూల్ అంటే మీ దగ్గరనుంచి పైసలు వసూల్ చెయ్యడం కాదు, పైసలు ఎలాగో వస్తాయ్ అని ప్రేక్షకులకు వివరించారు.

సమాజమే దేవాలయం, హిందూపురం ప్రజలకు నాజీవితాన్ని అంకితం చేస్తానని బాలయ్య అన్నారు.నాన్నగారు లవకుశ చేస్తే నేను శ్రీరామ రాజ్యం చేసాను,నాన్నగారు ఆ సినిమా చేస్తే నేను ఇది చేసాను,ఆయనే నా ఇన్స్పేషన్ అని అన్నారు బాలకృష్ణ.పైసావసూల్ బాలకృష్ణకు రీ లాంచింగ్,నటనంటే ఊరికే అరవడం కాదనీ,నటుడంటే మీరు రోజూవాడే టూత్ బ్రష్,ఉప్పు పప్పులెక్క ఓ నిత్యవసర వస్తువు,నేనూ మీ నిత్యవసర వస్తువునే,మీకు ఏం కావాలో అది ఇవ్వడమే నాపని.జగదేకవీరుడి శివశంకరీ పాట స్టేజిమీద పాడాలి.కష్టపడి పనిచెయ్యాలి జనానికి వేడి వేడిగా ఏదో అందించాలి.నేనూ ఈ సినిమాలో ఓ పాట పాడాను గంటలో పాడేసాను అందుకే గొంతు పోయింది అన్నారు బాలయ్య.