balakrishna suggested pawan kalyan name to bheemla nayak revealed in unstoppable show
mictv telugu

అన్ స్టాపబుల్ షోలో బయటపడ్డ.. పవన్ – బాలయ్యల రహస్య స్నేహం.. ఈ వీడియోనే సాక్షం

October 22, 2022

balakrishna suggested pawan kalyan name to bheemla nayak revealed in unstoppable show

ఇండస్ట్రీలో రెండు భిన్న ధ్రువాలు పవన్ కళ్యాణ్ బాలకృష్ణలు. ఒకరు టీడీపీ అధ్యక్షుడి కుమారుడు, ఇంకొకరు జనసేన అధ్యక్షుడు. మెగా ఫ్యామిలీకి పవన్ ప్రతినిధి అయితే నందమూరి వంశానికి వారసుడు బాలయ్య. మాటతీరు, హావభావాలు, నటన ఇలా అన్నింటిలో వీరిమధ్య ఎన్ని తేడాలున్న.. ఆవేశానికి మాత్రం ఇద్దరు బ్రాండ్ అంబాజిడర్స్. కోపం వస్తే ప్రత్యర్దులని మాటలతో మట్టికరిపిస్తారు. అన్నింటికీ మించి ఇండస్ట్రీలో అత్యంత అభిమానులున్న కుటుంబాలు. ఎప్పటినుండో వైరం ఉన్న ఫ్యామిలీస్. అలాంటి వీరిద్దరూ మంచి స్నేహితులు అని కూడా కొద్ది మంది నోటా వింటుంటాం. ఆఫ్ ది స్క్రీన్ పవన్, బాలయ్యలు తరచుగా మాట్లాడుకుంటారని.. ఒకరి సినిమాలను మరొకరు ప్రశంసించుకుంటారని.. అప్పుడప్పుడు సీక్రెట్ గా కలుసుకుంటారని కూడా టాక్. అలాంటి వీరిద్దరి రహస్య స్నేహం తొలిసారి బయటపడింది.

బాలయ్య అన్ స్టాపబుల్ షో సాక్షిగా పవన్ కళ్యాణ్ అంటే బాలయ్యకు ఎంత ఇష్టమో అందరికి తెలిసింది. తాజాగా హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డలతో పాటు నిర్మాత సూర్య దేవ‌ర నాగ వంశీ అన్ స్టాపబుల్ షో సీజన్ 2 ఎపిసోడ్ 2కి గెస్టులుగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ లో సూర్య దేవ‌ర నాగ వంశీతో బాలయ్య చేసిన కన్వర్జేషన్.. వీరిమధ్య వచ్చిన పవన్ కళ్యాణ్ టాపిక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. భీమ్లా నాయ‌క్ సినిమాలో హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. నిజానికి ఆ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంటే ముందు నంద‌మూరి బాల‌కృష్ణ‌ను హీరోగా అనుకున్నార‌ట‌. ఆయ‌న‌కు క‌థ కూడా చెప్పారు. ఆయ‌న‌కీ న‌చ్చింది. అయితే త‌న‌కంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి అయితే అది బావుంటుంద‌ని నిర్మాత సూర్య దేవ‌ర నాగ వంశీకి స‌జెస్ట్ చేశార‌ట‌ బాలయ్య. ఈ విషయాన్నీ సూర్య దేవ‌ర నాగ వంశీతో బాలయ్యనే స్వయంగా చెప్పించాడు. ఇప్పుడా వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది.