నందమూరి బాలకృష్ణ తప్ప మరెవరు హోస్ట్ చేయలేని టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె’. ఈ టాక్ షోకి లేటెస్ట్ గా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. నిన్న అట్టహాసంగా జరిగిన షూటింగ్ లో బాలకృష్ణ ఆసక్తికర ప్రశ్నలతో జరిపిన ఇంటర్వ్యూ షూటింగ్ ముగిసింది. ఇక ఈ షోకి ముఖ్య అతిధులుగా పవన్ కళ్యాణ్ తో పాటు తన సన్నిహితుడు త్రివిక్రమ్ కూడా పాల్గొన్నాడు. అయితే పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఈ తోలి టీవీ ఎపిసోడ్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఎపిసోడ్ లో పవన్ తో పాటు చీఫ్ గెస్టులుగా చాలా సర్ప్రైజ్ లు ఉన్నట్టు ఊహాగానాలు వినపడుతున్నాయి. అయితే మొదట వినపడిన వదంతుల ప్రకారం..ఈ షోకి పవన్ కళ్యాణ్ తోపాటు సుప్రీం హీరో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా పాల్గొన్నాడని టాక్ వినపడింది.
ఇక టాక్ షో మధ్యలో పవన్ ఆత్మగా చెప్పే త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్ కూడా స్పెషల్ ఎంట్రీ ఇచ్చారని లీకులు వస్తున్నాయి. అయితే ఇవే కాకుండా మరిన్ని సర్ప్రైజ్ లు కూడా ఉన్నాయట. షో మధ్యలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు బాలకృష్ణ ఫోన్ కాల్ చేసి మాట్లాడాడని.. షోకి వెళ్లిన పవర్ స్టార్ ఫ్యాన్స్ లీక్స్ ఇస్తున్నారు. చరణ్, తారక్ లతో బాలకృష్ణ మాట్లాడటమే కాకుండా.. పవన్ కూడా పలకరించాడని అంటున్నారు. మొన్ననే ప్రభాస్ ఎపిసోడ్ లో సైతం రామ్ చరణ్ ఫోన్ కాల్ తెగ వైరల్ అయింది. ‘ ఒరేయ్ చరణ్.. నువ్వు నా ఫ్రెండా, శత్రువారా ‘? అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేయగా.. మళ్ళీ ఇప్పుడు తారక్, చరణ్ లతో పవన్- బాలయ్యలు ఏం మాట్లాడారో అన్న ఆసక్తి నెలకొంది.