ఎన్టీఆర్ బయోపిక్ కు వర్మ న్యాయం చేస్తాడా ? - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్టీఆర్ బయోపిక్ కు వర్మ న్యాయం చేస్తాడా ?

July 4, 2017


స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్రపై బయోపిక్ వస్తుందని చాలా రోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తాజా అప్ డేట్ ఏంటంటే.. రాంగోపాల్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్సులు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇందులో హీరోగా తండ్రి పాత్రలో బాలకృష్ణ నటిస్తుండటం విశేషం. ఒక ప్రైవేట్ పార్టీలో కలుసుకున్న బాలకృష్ణ, వర్మలు ఈ విషయంపై ఫేస్ బుక్ లైవ్ లో తెలపడం మరింత విశేషమైన వార్తగా నిలిచింది.

అయితే ఇక్కడ చాలా మందికున్న డౌట్లు ఏంటంటే.. సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ ఒదుగుతాడా ? అసలతను సెట్ అవుతాడా ? ఎంత కొడుకైతే మాత్రం తండ్రి పాత్రకి న్యాయం చెయ్యగలడా ? మనవడైన జూనియర్ ఎన్టీఆర్ అయితే తాత పాత్రకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చెయ్యగలడేమో.. బట్ బాబాయ్ – అబ్బాయ్ లకు అస్సలు పొసగదాయె !? అలాగే ఈ సినిమాకు వర్మ దర్శకుడిగా ఫిట్టేనా ? రక్తపాతాలు, క్రైం, థ్రిల్లర్, హర్రర్, ఎక్స్ పోజింగ్ సినిమాలు తీసే వర్మ ఈ బయోపిక్ కు ఏ మేరకు న్యాయం చెయ్యగలడు ? ఒకవేళ వర్మ ఈ కథ మీద కసరత్తు చేయాల్సొస్తే లక్ష్మీ పార్వతి రోల్ కు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాడేమో ? ఎందుకంటే సినిమాలో గ్లామర్ శాతం తగ్గొచ్చనే ఆలోచనతో లక్ష్మీపార్వతి పాత్రను హాట్ గా డిజైన్ చేస్తుండొచ్చు.

బాలకృష్ణకు పిన్ని అంటే అస్సలు గిట్టదు కాబట్టి ఆ పార్టును ఎత్తి పారేస్తుండొచ్చు !? అది తీసేసినా ఇంకొక చిక్కొచ్చి పడుతుంది.. అదేమిటంటే ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో అల్లుడు చంద్రబాబు నాయుడు పొడిచిన వెన్నుపోటు ఎంత తీవ్రమైందో సినిమాలో చూపించగలడా ? ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు బాలయ్యకు వియ్యంకుడు కాబట్టి. సో.. బావ కమ్ వియ్యంకుడి పాత్రను కూడా బయోపిక్ నుండి డిలీట్ చేసే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వర్మ ఈ సినిమా కోసం అప్పుడే తన గొంతు విప్పి పాట కూడా పాడేసాడు. ఆలూ లేదు చూలు లేదు అల్లుడు పేరు రామలింగం అన్నట్టు అప్పుడే వర్మ సాంగ్ పాడి బయటకు వదలడమేంటో అని కొందరు సినీ విశ్లేషకులు ముక్కు విరుస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ మీద సినిమా చేసే అవకాశం తనకు రావడం పట్ల చాలా ఎక్సైటెడ్ గా వున్నాడు వర్మ. చూడాలి మరి రెండు భిన్న ధృవాలైన వర్మ, బాలయ్యలు కలిసి ఎన్టీఆర్ బయోపిక్ కు ఏమాత్రం న్యాయం చెయ్యగలరో ?