టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయనీ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలయ్య తెలిపారు. గత రెండు రోజులుగా తనను కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. త్వరలోనే కోలుకొని సాధారణ కార్యకలాపాల్లో పాల్గొంటానని అభిమానులకు భరోసానిచ్చారు. కాగా, ఇటీవలే బాలయ్య బసవతారకం ఆసుపత్రి 22వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి హరీష్ రావు కూడా బాలయ్యను కలిశారు. ఇప్పుడు బాలయ్యకు కరోనా అని తేలడంతో హరీష్ రావు, ఆయన వెంట వచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. తమకేమైనా సోకిందేమోనని అనుమానంతో కరోనా టెస్టులు చేయించుకోవడానికి ఆస్పత్రులుకు పరుగులు తీస్తున్నారు.