ఇప్పటికే విడుదలయిన జై బాలయ్య, సుగుణా సుందరీ పాటలు అభిమానులను ఊర్రూతలూగిస్తున్నాయి. థమన్ మరోసారి తన మార్క్ కంపోజిషన్‌తో మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు గోపిచంద్ మలినేని జనవరి ఫస్ట్‌న ట్రైలర్ విడుదల చేసి కొత్త సంవత్సరం కొంత జోష్‌ను నింపాలని అనుకుంటున్నాడు. మైత్రి మూవి మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో రూపొందుతున్నది.
మా బావ మనోభావాలు పాట డిసెంబర్ 24న విడుదల చెయ్యనున్నది చిత్రం బృందం. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్య 35 ఎమ్ఎమ్ దీనికి వేదిక కానున్నది. సెన్సెషల్ లాంచ్ ఫర్ ది స్పెషల్ సాంగ్ పేరుతో చేస్తున్న ఈవెంట్‌కు బాలకృష్ణతో పాటు శృతిహసన్ హాజరయ్యే అవకాశం ఉన్నది.
సరికొత్త స్టన్నింగ్ లుక్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన బాలయ్యబాబు ఫెర్మామెన్స్ కూడా డోస్ పెంచి మరీ చేశాడని ఫిలింనగర్ టాక్. బాలయ్య బాబు పరిస్థితి ఇలా ఉంటే.. సినిమాలో చెల్లెగా నటించిన వరలక్ష్మీ శరత్‌కుమార్ థియేటర్ లో జనాలకు ఏడిపించడం ఖాయం అంటున్నారు చిత్ర యూనిట్. షూటింగ్ సమయంలో వరలక్ష్మీ నటన చూసి సెట్లో బాలకృష్ణ కంటతడి పెట్టుకున్నాడని … చాలా బాగా నటించావని అభినందించాడని టాక్.
ఇదిలా ఉండగా కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్ నటించిన కథను తీసుకొని వీరసింహరెడ్డి చిత్రాన్ని తీస్తున్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. లుంగీ, బ్లాక్ షర్ట్‌తో ఫస్ట్ లుక్ విడుదలయినప్పటి నుంచి లుక్‌తో పాటు కథానేపథ్యం కూడా అచ్చం అలాగే ఉండొచ్చనే భావన కలిగింది. ఈ విషయం మీద పలు సైట్లలో వార్తలు కూడా వచ్చాయి. కానీ చిత్ర యూనిట్ ఏమీ స్పందించలేదు. వీర సింహారెడ్డిలో బాలకృష్ణ డబుల్ యాక్షన్ అని కొందరు అంటుంటే… మరికొందరు మాత్రం.. ఇంటర్వెల్ లో బాలకృష్ణ మరణిస్తే.. సెకండ్ హాఫ్‌లో మొత్తం ఫ్లాష్బ్యాక్లతో కథ కొనసాగుతుందని అంటున్నారు. ఏదీ ఏమైనా మంచి పాజిటివ్ వైబ్‌తో ఉన్న వీరసింహారెడ్డి చిత్రం మాత్రం సంక్రాంతి బరిలో దిగి మంచి విజయమే సాధించేలా అనిపిస్తుంది.