Balakrishna's wife Vasundhara started anna canteen in Hindupur
mictv telugu

2 రూపాయలకే భోజనం.. ప్రారంభించిన బాలయ్య భార్య

May 28, 2022

Balakrishna's wife Vasundhara started anna canteen in Hindupur

నందమూరి బాలక‌ృష్ణ సతీమణి వసుంధర శనివారం హిందూపూర్‌లో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఇందులో కేవలం రెండు రూపాయలకు ఏడాది పొడవునా భోజనాన్ని అందించనున్నారు. మహానుభావుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరైన వసుంధర.. పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో మొబైల్ క్యాంటీన్‌ను ఓపెన్ చేశారు. గతంలో ఎన్టీఆర్ సీఎంగా ఉండగా రెండు రూపాయలకు బియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకం స్పూర్తితో అన్న క్యాంటీన్‌లో రెండు రూపాయలకు నాణ్యమైన భోజన పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఆమె తెలిపారు.

టీడీపీ ఎన్నారై విభాగం, బాలయ్య బాబు అభిమానులు సంయుక్తంగా ఈ పథకానికి నిధులు సమకూర్చారని వెల్లడించారు. కాగా, ఈ సందర్భంగా వసుంధర మాట్లాడుతూ హిందూపురంను నందమూరి పురంగా పలకడం గమనార్హం. ఇదిలా ఉండగా, గుంటూరులోని ఎన్టీఆర్ బస్టాండ్ కూడలిలో మరో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. అయితే అక్కడ ఐదు రూపాయలకు భోజనం అందించనున్నారు.