అయ్యో బాలయ్య...కెమెరాలున్నయని సూస్కోవాలె గదయ్యా..! - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యో బాలయ్య…కెమెరాలున్నయని సూస్కోవాలె గదయ్యా..!

August 17, 2017

ఓట్లు రాలాలంటే పైసల్… పైసల్ రాలాల్సిందే,ఎన్ని పైసలు పంచుతే అన్ని ఓట్లు రాలుతయన్నట్టు.ఇది అందర్కి తెలిసిన ఓపెన్ సీక్రెట్టే,కనీ  పైసలు పంచినట్టు,తీస్కున్నట్టు  మూడో కంటికి తెల్వకుంట జాగ్రత్త పడుతుంటరు ఇటు రాజకీయ నాయకులు, అటు పబ్లిక్కు కూడా.

ఐదేండ్లు అధికారంల ఉంటం…పంచిన పైసలకు పదింతలు సంపాయించుకోవచ్చు అని  రాజకీయనాయకులు సూస్తరు.ఇగ పబ్లిక్కేమో దొర్కిందే సందురా …ఎవ్వలెక్కో పైసలిస్తే ఆళ్లకే ఓటు గుద్దాలే,అందరి దగ్గర పైసలు తీస్కొని  ఎవలో ఒకల్కి ఓటెయ్యాలే అని సూస్తుంటరు,కనీ మల్లా ఓట్లచ్చేదాక లీడర్లు వాళ్ల దిక్కు మర్రి గుడ సూడరు అన్న ముచ్చట మర్చిపోతరు పబ్లిక్కు.

ఇగో బాలకృష్ణ సారును సూడున్రి..అరరే ఓటర్లంటే ఎంత అభిమానం,తమ అభ్యర్ధిని గెలిపియ్యాలనే తపన,బావ కండ్లల్ల ఆనంద సూడాలనే ఆరాటం,అందుకే పచ్చనోట్లను ఈ తీరుగ పబ్లిక్కుకు పంచుతుండన్నట్టు.పబ్లిక్కును జూడున్రి పులిహోర పొట్లాలకు ఎగవడ్డట్టు పచ్చనోట్లకోసం ఎట్లెగవడ్తున్రో,అయినా ఆళ్లేం జేస్తరు పాపం,పైసలు తీస్కున్నా, తీస్కోకపోయినా రాజకీయం గురించి ఆళ్లకు తెల్సే కావట్టి,సచ్చినోని పెళ్లికి అచ్చిందే కట్నం అని మురుస్తరు.. బాలకృష్ణ డబ్బులు పంపిణీ వ్యవహారం ఎన్నికల కమిషన్‌(ఈసీ) దృష్టికి గుడ వెళ్లిందట.గిట్లైతె ఎట్ల బాలయ్య పబ్లిక్ గ పచ్చనోట్లు పంచేటప్పుడు,సుట్టు కెమ్రాలున్నయా లేవో సూస్కోవాలె గదా అని అన్కుంటున్నరు ఈ దృశ్యం సూశినోళ్లంత.

నా అభిమాని ఇచ్చిన రెండు వేల రూపాయలకి చిల్లర ఇస్తున్న,అది తప్పేనా .?

ఇగ దీనిపై బాలకృష్ణ స్పందిస్తూ నాఅభిమానికి  రెండువేల రూపాయలకు చిల్లర ఏడ దొర్కుతలెవ్వట పాపం,అందుకే నాదగ్గరున్న చిల్లర ఇస్తున్న అదిగుడ తప్పేనా అని వివరణ ఇచ్చిండట,కనీ లే లేలే పైసలు పంచుతూ అడ్డంగ దొర్కిండు కాబట్టి ఏదో చిల్లర,2000 నోటు అని కవరింగ్ జేస్తుండని గుసగుస వెట్కుంటున్నరు కొందరు.