Home > Featured > రికార్డ్ బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డూ.. ధర ఎంతంటే..

రికార్డ్ బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డూ.. ధర ఎంతంటే..

Balapur...

వినాయక చవితి వచ్చిందంటే హైదరాబాద్‌లో అందరికి గుర్తుకు వచ్చేంది.. ఖైరతాబాద్ మహాగణపతి, బాలాపూర్ లడ్డూ ప్రసాదం. దేశంలోనే వీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి ఏటా బాలాపూర్ లడ్డూను దక్కించుకోవడం కోసం ఎంతో మంది పోటీ పడుతుంటారు. ఈసారి కూడా లడ్డూ ధర భారీగానే పలికింది. రూ. 17.60 లక్షలకు కొలను రాంరెడ్డి దక్కించుకున్నారు. రెండు కిలోల బరువున్న వెండి పళ్లెంలో ఉంచిన 21 కిలోల లడ్డూను ఉత్సవ నిర్వాహకులు ఆయనకు అందజేశారు. కాగా కొలన్ కుటుంబం గతంలోనూ పలుమార్లు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు.

బాలాపూర్ పురవీధుల్లో గణేశుడి ఊరేగింపు తర్వాత బాలాపూర్ గ్రామ నడిబొడ్డున ఈ వేలం నిర్వహించారు. వేలం పాట చూడాటానికి ఆసక్తితో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ సారి బాలాపూర్‌ లడ్డూ కోసం 28 మంది పోటీ పడ్డారు.1994లో జరిగిన తొలిసారి వేలం పాటలో లడ్డూ రూ.450 ధర పలికింది. గత ఏడాది రూ.16.60 లక్షల వరకు ఈ లడ్డూ పలికింది. ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేస్తూ.. లక్ష రూపాయలు అదనంగా ధర లభించింది. లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్న వారికి మంచి జరుగుతుందనే విశ్వాసంతో దీనికి ఇంత ప్రాధాన్యం ఇస్తుంటారు.

Updated : 12 Sep 2019 12:23 AM GMT
Tags:    
Next Story
Share it
Top