Balayya angry on the fan in ongole
mictv telugu

అభిమానిని కంటి చూపుతో చంపేంత పని చేసిన బాలయ్య.. వీడియో

January 6, 2023

బాలయ్య బాబు నటించిన తాజా చిత్రం వీర సింహారెడ్డి చిత్ర ప్రిరిలీజ్ ఈవెంట్ ఒంగోలులో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బాలయ్య, హీరోయిన్ శ్రుతీ హాసన్ హైదరాబాద్ లోని మొయినాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఒంగోలు బయల్దేరి వెళ్లారు. అంతకు ముందు శ్రుతిహాసన్ బాలయ్య కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక ఒంగోలు చేరుకున్న బాలయ్యకు ఘన స్వాగతం లభించింది. ఆయనను చూసేందుకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బాలయ్య వేదిక వైపు నడిచి వెళ్తుండగా, ఓ అభిమాని ప్రేమతో శాలువా కప్పేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అభిమాని చేయి తగిలి బాలయ్య తల మీద ఉన్న కళ్లజోడు కిందపడిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహించిన బాలయ్య తన కోపాన్నంతా కళ్లతో చూపించేశారు. కళ్లద్దాలు చూసుకోవా అంటూ విసుక్కున్నారు. బాలయ్య రియాక్షన్ తో సదరు అభిమాని చిన్నబుచ్చుకోగా, కప్పిన శాలువాను బాలయ్య అంతే వేగంగా తీసేశారు. ఇదంతా అక్కడున్న కెమెరాల్లో రికార్డవడంతో వీడియో వైరల్ గా మారింది. కొట్టలేదు సంతోషించు అని ఒకరు, కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తాడు మా బాలయ్య అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు.