Balayya Babu Veerasimha Reddy OTT release Date Fix
mictv telugu

ఓటీటీలోకి వీరసింహారెడ్డి…ఎప్పట్నుంచో తెలుసా?

February 12, 2023

 

బాలయ్యబాబు అభిమానులకు గుడ్‎న్యూస్. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన వీరసింహారెడ్డి సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది. తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై అధికారికంగా ప్రకటన వెలువడింది. వీరసింహారెడ్డి, ఓటీటీ రైట్స్‎ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్నాయి. ఈ విషయాన్ని ట్విట్టర్ అకౌంట్ ద్వారా డేట్‎ను ప్రకటించింది సంస్థ. ఈనెలలోనే ఓటీటీలోకి వస్తుందని, ఫిబ్రవరి 23 సాయంత్రం 6 నుంచి ప్రేక్షకుల అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

ఓటీటీ తేదీ ఫిక్స్ అవ్వడంతో బాలయ్యబాబు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. థియేటర్లలో చూడటం చూడని ప్రేక్షకులు ఓటీటీ ఆడియెన్స్ కూడా ఈ మూవీ కోసం ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ డిజిటల్ రైట్స్‎ను రూ. 14కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. కాగా ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‎పై నవీన్ ఏర్నెని,రవిశంకర్ నిర్మించారు. ఈ మూవీలో బాలయ్య సరసన శ్రుతి హాసన్ నటించింది.

బాలయ్య బాబు ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‎లో నటిస్తున్నారు. NBK108పేరుతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడూ రాయలసీమ భాషలో రఫ్పాడించే బాలయ్యబాబు ఈసారి మాత్రం తెలంగాణ యాసలో ఇరగదీస్తారని తెలుస్తోంది.